iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: శివాజీ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన శోభా శెట్టి!

  • Published Sep 28, 2023 | 12:03 PM Updated Updated Sep 28, 2023 | 12:03 PM
  • Published Sep 28, 2023 | 12:03 PMUpdated Sep 28, 2023 | 12:03 PM
Bigg Boss 7 Telugu: శివాజీ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన శోభా శెట్టి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్స్ నాలుగో పవరాస్త్రం కోసం తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే మొదటి టాస్కు పూర్తైంది ఆ టాస్కులో అమర్ దీప్, గౌతమ్ జంట విజయం సాధించింది. టాస్కు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా మరీ ముఖ్యంగా బ్యాంకర్స్ మధ్యలో కాస్త గొడవలు జరగియా. ఆట సందీప్- శోభాశెట్టి ఒక జట్టు శివాజీ ఒక్కడు ఒక జట్టులా కనిపించాలు. ఆట జరుగుతున్నంతసేపు శివాజీ మాటలు, చేతలతో సందీప్, శోభా విసిగిపోయారు. శివాజీ ప్రతి విషయంలో క్లారిటీ లేదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఆ తర్వాత వాళ్లు నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం జనాలు చూస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

చూసినంతసేపు చూసి సందీప్- శోభా ఇంక ఇలా అయితే వర్కౌట్ కాదని ఫిక్స్ అయిపోయారు. ఇంక ఎప్పుడు శివాజీ కదిలిస్తే అప్పుడు బరస్ట్ అయిపోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. శివాజీ కావాలనే వారిని నెగిటివ్ గా జనాలకు పోట్రే చేస్తున్నాడు అని ఫిక్స్ అయ్యారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. రెండో బజర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ అందరూ కిచెన్ లో వంట చేస్తున్నారు. ప్రశాంత్, యావర్ మాత్రం బయట కూర్చుని తింటున్నారు. బజర్ రాగానే కొట్టాలి అని. అక్కడే కూర్చుని తినడమే కాకుండా.. ప్రశాంత్ కి హెల్త్ బాగోకపోతే ప్రశాంత్ తో తెప్పించుకుంటున్నాడు అని అందరూ సీరియస్ అయ్యారు. పైగా 6 చపాతీలు తిన్నాడు.. అన్నం తింటున్నాడు అంటూ అందరూ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా బయట కూర్చొని తింటున్నాడు, అతనికి ఇంకొకరు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్న సమయంలో సీన్ లోకి శివాజీ ఎంటర్ అయ్యాడు. బెడ్ రూమ్ లోకి ఆమ్లెట్ తీసుకెళ్లి ఇవ్వగా లేనిది.. ఇప్పుడు ఎందుకు అని క్వశ్చన్ చేశాడు.

ప్రిన్స్ యావర్ బజర్ కొట్టేందుకు అక్కడ కూర్చున్నాడు అని సందీప్ అంటాడు. అందరూ బజర్ కొట్టాలి.. వీళ్లంతా పిచ్చోళ్లా ఇక్కడ పనులు చేయడానికి అంటూ సీరియస్ అవుతారు. యావర్ తాను తినను అని ప్లేట్ అక్కడ పెట్టేస్తాడు. సందీప్ అలా ఫుడ్ వేస్ట్ చేయద్దు అంటూ సీరియస్ అవుతాడు. ఈ గ్యాప్ లో జనాలు చూస్తున్నారు అంటూ శివాజీ డైలాగ్ కొడతాడు. ఆ మాటతో శోభాశెట్టి వార్ స్టార్ట్ చేస్తుది. మీరు ప్రతి దానికి జనాలు చూస్తున్నారు అంటూ మమ్మల్ని బ్యాడ్ గా పోట్రే చేయాలని చూస్తున్నారు. ప్రతి విషయంలో మీరు అలాగే చేస్తున్నారు అంటూ కడుపులో ఉన్నది మొత్తం కక్కేసింది. నిజంగానే జనాలు చూస్తున్నారు.. మేము బ్యాడ్ చేస్తే మమ్మల్ని పనిష్ చేస్తారు అంటుంది. అందుకు శివాజీ చాలా సిల్లీగా నువ్వెందుకు జనాలు అంటున్నావ్ అంటూ ప్రశ్నిస్తాడు. శివాజీ కావాలనే తమని రాంగ్ గా పోట్రే చేస్తున్నాడు అనే విషయాన్ని శోభాశెట్టి బలంగా చెప్పింది.

యావర్, ప్రశాంత్ విషయంలో శివాజీ బయాస్డ్ గా ఉంటున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. కాయిన్స్ పంచడం కూడా యావర్ కే ఎక్కువ ఇచ్చినట్లు కనిపించింది. అమర్ విషయంలో నెగిటివ్ గా ఉంటున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ఆ విషయం బయటపడింది కూడా. అమర్ పేరు అనౌన్స్ చేస్తామని చెప్పినప్పుడు అలా చేస్తే జనాలు చూస్తున్నారు అంటూ శివాజీ చెప్పడం చూశాం. అమర్ వాళ్లు ఆడుతున్నప్పుడు కావాలనే ఫొటోలు స్లోగా కొట్టారు అని కూడా గౌతమ్ ఆరోపించారు. మొత్తానికి చాలా రోజులుగా శివాజీ ఆడుతున్న మైండ్ గేమ్, డబుల్ గేమ్ మరోసారి బయటపడింది. హౌస్ లో ఇప్పుడు చాలామంది శివాజీ కావాలనే అలా చేస్తున్నారు అనే విషయాన్ని గ్రహించినట్లు కనిపించింది. శివాజీ కూడా మాస్క్ తీసేయడానికి ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. యావర్ తో మాట్లాడుతూ అమ్మా అమ్మా అంటే వినరు. ఇవాళ్టి నుంచి నేనేంటో చూపిస్తాను అంటూ డైలాగులు చెప్పాడు. మరి.. ఇప్పటి నుంచైనా మాస్కు లేకుండా ఆడుతాడేమో చూడాలి. మరి.. శివాజీ- శోభాశెట్టి గొడవలో తపపు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet