iDreamPost
android-app
ios-app

రైతుబిడ్డకి గర్వం తలకెక్కిందా? అప్పట్లో బతిమిలాడి.. ఇప్పుడు కండీషన్స్?

  • Published Dec 19, 2023 | 12:57 PM Updated Updated Dec 19, 2023 | 12:57 PM

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. గెలిచాక ఎన్నో ప్రశంసలు పొందాడో.. ఇప్పుడు అతని చేతలు, మాటలతో విమర్శల పాలు అవుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ఏదైతే సోషల్ మీడియాను వినియోగించుకున్నాడో.. ఇప్పుడు ఆ ఇన్ల్యుయెన్సర్ల పట్ల దురుసుగా మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు.

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. గెలిచాక ఎన్నో ప్రశంసలు పొందాడో.. ఇప్పుడు అతని చేతలు, మాటలతో విమర్శల పాలు అవుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ఏదైతే సోషల్ మీడియాను వినియోగించుకున్నాడో.. ఇప్పుడు ఆ ఇన్ల్యుయెన్సర్ల పట్ల దురుసుగా మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు.

  • Published Dec 19, 2023 | 12:57 PMUpdated Dec 19, 2023 | 12:57 PM
రైతుబిడ్డకి  గర్వం తలకెక్కిందా? అప్పట్లో బతిమిలాడి.. ఇప్పుడు కండీషన్స్?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 హడావుడి ముగిసిపోయింది. సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు. అతడిని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించిన సంగతి విదితమే. బస్సులను ధ్వంసం చేశారు. సెలబ్రిటీ కార్ల అద్దాలు పగులగొట్టి భీభత్సం, భయానక పరిస్థితులు సృష్టించారు. అలాగే పల్లవి ప్రశాంత్ హౌజ్ నుండి బయటకు రాగానే..ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో తన అమాయకత్వం, వినయ విధేయతలో ఆడియెన్స్ హృదయాలను గెలిచిన పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు విమర్శల పాలు అవుతున్నాడు. తాను హౌస్‌లోకి వెళ్లేందుకు ఏ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నాడో.. ఇప్పుడు వాళ్లను లెక్క చేయడం లేదని తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు యూట్యూబ్ ఛాన్సల్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి.. తనను సపోర్ట్ చేయండని బతిమాలాడిన ప్రశాంత్.. బయటకు రాగానే ఇంటర్వ్యూ అడిగితే.. ‘ఇప్పుడు నేనివ్వను, నేను నిద్ర పోవాలి’అంటూ పిచ్చి పిచ్చి కారణాలు చెబుతున్నారు. ఇంటర్వ్యూ ఇస్తానని పర్మిషన్ తీసుకున్నాకే.. అతడి ఇంటి వద్దకు వచ్చిన మీడియాను సైతం 18 గంటల పాటు వెయిట్ చేయించాడు. ఆ తర్వాతైనా ఇస్తాడా అంటే అదీ లేదు. ఒక్క 10 నిమిషాల ఇంటర్వ్యూ అడిగినా కూడా చాలా దురుసుగా సమాధానం చెబుతున్నాడని యూట్యూబర్స్ చెబుతున్నారు. మీరు రైతుుకు ఏమిస్తారో చెప్పుర్రి అంటూ మీడియాను ప్రశ్నలు వేశాడు. మరీ నువ్వేం చేసినవ్ అని అడిగితే.. నేనేమన్నా సీఎంనా అంటూ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నాడని పేర్కొంటున్నారు. ఈ ప్రవర్తన పట్ల బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ శివ తప్పుపట్టాడు. ‘ప్రశాంత్.. 18 గంటల పాటు వెయిట్ చేయించి.. ఇంటికి రా అన్న ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచారు. అక్కడికి వెళ్లి 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను, ఇక్కడ నుండి వెళ్లిపోండి అని రెక్లెస్‌గా సమాధానం చెప్పాడు. ఒక గొప్ప విన్నర్’అంటూ కామెంట్ చేశాడు శివ.

pallavi prasanth rude behaviour

‘అక్కడే ఉన్న స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు. పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అన్న మమ్మల్ని కూడా పట్టించుకోలేదని బాధపడుతుంటే.. ఇప్పుడే వచ్చాడు కదా అర్థం చేసుకోండి అన్నా. ఏమనాలి? ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని అని ఈ మేసేజ్ లు పెట్టడం లేదు. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు’అని పేర్కొన్నాడు శివ. అలాగే మీడియా, యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వమంటే.. పొలం దగ్గరకు పోదాం రండి.. అని ఓ సారి.. మీ యూట్యూబ్ ఛానల్ నుండి రైతుకు ఏమిస్తారో చెప్పండి అన్న పల్లవి ప్రశాంత్ వీడియోలను షేర్ చేసిన యాంకర్ శివ ‘బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఇంటర్వ్యూలు ఇచ్చావ్ గా ప్రశాంత్..అప్పుడు లేని కండిషన్లు ఇప్పుడు ఎందుకు’ అంటూ ప్రశ్నించాడు. ఆ రోజు రైతుకు ఏమైనా ఇవ్వమని ఎందుకు చెప్పలేదంటూ పేర్కొన్నాడు.

‘ఇక పొద్దున నుండి నాకు ఒకటే మెసేజ్ లు. నీకెందుకు ఇవ్వాలిరా ఇంటర్వ్యూ’ అని. ‘అరే బాబు నాకు ఒక్కడికే కాదురా.. 10 మంది చానల్స్ కు ఇదే సమాధానం చెప్పాడు. వాళ్లు వదిలేశారు. నేను ఫైట్ చేస్తున్నా’ అని ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నాడు యాంకర్ శివ. అలాగే ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పిన వీడియోను కూడా పోస్టు చేశాడు. ‘ప్రశాంత్ గెలిచిండా.. సింపథీ గెలిచిందా’అంటూ ప్రశ్నించాడు. ‘అందరూ రైతు బిడ్డను నామినేషన్ చేయగానే.. అయ్యో పాపం అంటూ ఓట్లు వేశారు. ప్రశాంత్ రియాలిటీని కంట్రోల్ చేసింది శివాజీ. ఆయనే లేకుంటే.. ప్రశాంత్ ఏంటో తెలిసేది’ అంటూ కామెంట్ చేశారు. కాగా అతడి వీడియోలు చూసి ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. అతడికి గెలిచానన్న గర్వం తలకెక్కిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.   ఇంట్లో ఒకలా.. బయటకు వచ్చాక.. మరోలా ప్రవర్తిస్తున్న ప్రశాంత్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş