iDreamPost
android-app
ios-app

Big Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తోంది.. ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లే..!

  • Published Jul 01, 2024 | 12:39 PM Updated Updated Jul 01, 2024 | 12:39 PM

Big Boss 8 New Update.. ఏడాదికి ఒక్కో సీజన్ తో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తోన్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఎనిమిదో సీజన్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వారికోసమే ఈ కీలక అప్డేట్

Big Boss 8 New Update.. ఏడాదికి ఒక్కో సీజన్ తో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తోన్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఎనిమిదో సీజన్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వారికోసమే ఈ కీలక అప్డేట్

  • Published Jul 01, 2024 | 12:39 PMUpdated Jul 01, 2024 | 12:39 PM
Big Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తోంది.. ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లే..!

బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్‌కు కొదవ ఉండదు. మహిళలకు సీరియల్స్, మగవాళ్లకు కామెడీ అండ్ డ్యాన్స్, గేమ్ షోస్ ఉండనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరినీ కట్టిపడేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. విదేశాల నుండి పాకిన ఈ గేమ్ షో.. భారత్‌లో కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. హిందీలో ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. అలాగే ఓటీటీలో కూడా అలరిస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా ఈ ప్రొగ్రామ్ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతుంది. తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎనిమిదో సీజన్ కోసం ప్రిపరేషన్ జరుగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయే లిస్టు ఇది అంటూ గతంలో ఓ జాబితా విడుదలయ్యింది. కానీ ఇప్పుడు ఈ సీరియల్‌కు సంబంధించిన కొత్త ఆప్ డేట్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచాడు సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. కాగా, ఈ సీజన్‌లోనే మూడవ రన్నర్‌గా నిలిచిన టాలీవుడ్ హీరో శివాజీ.. సీజన్ 8కి అతడే హెస్ట్ అంటూ ఓ ప్రచారం జరుగుతుంది. కానీ నాగార్జుననే ఈ సారి కూడా హోస్ట్ అని దాదాపు కన్ఫమ్ అయినట్లేనని తెలుస్తుంది. అయితే సీజన్ 8 కోసం బిగ్ లిస్ట్ ప్రిపేర్ అయినట్లు సమాచారం. సెలబ్రిటీలు ఫైనల్ అయ్యారని, ఇంచుమించు ఇదే ఫైనల్ కావచ్చునని టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల 4 లేదా 11వ తేదీల్లో స్టార్ట్ కానుందట. ఈ సారి కూడా వంద రోజులకు పైగా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉండనున్నారు. సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు.

ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఇన్ స్టాతో ఫేమస్ అయిన ఇన్ఫ్లయెన్సర్లను ఎక్కువగా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకు వస్తున్నారు. ఈ సారి కూడా వారికే పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంపై తిరగబడి.. ఎన్నిక్లలో నిలబడిన బర్రెలక్క.. అలాగే హాయ్ నాన్న మీది థజౌండ్ రూపీస్ అయ్యింది అంటూ ఫేమ్ అయిన కుమారీ ఆంటీ.. సామాన్యుల జాబితాలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా హీరో రాజ్ తరుణ్, నటి సురేఖా వాణి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బుల్లితెరపై తన అందచందాలతో అలరిస్తున్న రీతూ చౌదరి, కమెడియన్ ఆర్పీ పేర్లు వినబడుతున్నాయి. పరువు హత్యకు బాధితురాలైన అమృత కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. వీరికి తోడు యూట్యూబ్, ఇన్ స్టా వీడియోలతో ఫేమస్ అయిన మరికొంత మందిని ఇంట్లోకి తీసుకురాబోతున్నారట. ఈసారి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom