iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ సీజన్ 8కు రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే వారిలో ఆ భామలు?

  • Published Jun 10, 2024 | 6:35 PM Updated Updated Jun 10, 2024 | 6:35 PM

ఉల్టా పల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 బాగా ఆకట్టుకుంది. సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. సీజన్ 8 కూడా త్వరలో స్టార్ట్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సీజన్ కు రాబోయే సెలబ్రిటీల వివరాలంటూ..

ఉల్టా పల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 బాగా ఆకట్టుకుంది. సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. సీజన్ 8 కూడా త్వరలో స్టార్ట్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సీజన్ కు రాబోయే సెలబ్రిటీల వివరాలంటూ..

  • Published Jun 10, 2024 | 6:35 PMUpdated Jun 10, 2024 | 6:35 PM
బిగ్ బాస్ సీజన్ 8కు రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే వారిలో ఆ భామలు?

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా మెప్పిస్తోంది బిగ్ బాస్. పలు భాషల్లో ఈ షో అలరిస్తుంది. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు ముగిశాయి. ఎనిమిదో సీజన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుండి బిగ్ బాస్ సీజన్ 7 వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి విదితమే. అలాగే ఓటీటీకి కూడా ఆయనే హోస్ట్‌గా చేశారు. అయితే ఇప్పుడు 8 రాక కోసం ఈ ఎంటర్ టైన్ మెంట్ షో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్, యూట్యూబర్ ఆదిరెడ్డి సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్ ఎవరు ఉండొచ్చు అని కొన్ని పేర్లు ప్రకటించాడు

ఆయన ప్రకటించిన జాబితాలో.. బంచిక్ బబ్లు, రాజ్ తరుణ్, సోనియా సింగ్, హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీతో పాటు పలువురు పేర్లు వినిపించాయి. వారిలో ఇటీవల హాయ్ నాన్న నీది థౌజండ్ అయ్యింది అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన కుమారీ ఆంటీ, అలాగే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సెన్సేషనల్ అయిన బర్రెలక్క ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టబోతున్న సురేఖ వాణి ముద్దుల తనయ సుప్రీతతో పాటు కుషీత కల్లపు కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. సురేఖ వాణి కూడా రావొచ్చు. వీరికి తోడు జబర్థస్త్‌తో పాటు సోషల్ మీడియాలో తన అందచందాలతో కాక రేపే రీతూ చౌదరి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు వస్తే.. బిగ్ బాస్ షోకు కావాల్సినంత కంటెంట్ వచ్చినట్లే.

వీరితో పాటు బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జబర్దస్త్ నరేశ్, కిరాక్ ఆర్పీ, రియాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సారి సుమారు 20 మంది సెలబ్రిటీలు ఇంట్లోకి రానున్నారని తెలుస్తుంది. ఆల్మోస్ట్ వీరి పేర్లు ఖరారు కానున్నాయని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ఈ షోను ప్రసారం చేసే సంస్థ విడుదల చేయనున్నట్లు సమాచారం. గతంలో సీజన్ 7కి ఉల్టా పల్టా అంటూ కాన్సెప్టులతో వచ్చిన బిగ్ బాస్ షో.. ఈసారి మరింత ఆకట్టుకునే విధంగా టాస్కులు ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరి పేర్లు తొలగిస్తారో, ఎవరి పేర్లు యాడ్ అవుతాయో.. చివరకు తెలియదు. మరికొన్ని రోజుల్లో షో ప్రసారానికి సంబంధించిన వివరాలు వెల్లడైయ్యే అవకాశాలున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss