iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ పై విషం కక్కిన అర్జున్.. మడత పెట్టేయాలి అంటూ..!

  • Published Oct 13, 2023 | 6:56 PM Updated Updated Oct 13, 2023 | 6:56 PM
  • Published Oct 13, 2023 | 6:56 PMUpdated Oct 13, 2023 | 6:56 PM
Bigg Boss 7 Telugu: ప్రశాంత్ పై విషం కక్కిన అర్జున్.. మడత పెట్టేయాలి అంటూ..!

బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడితే ఎవరికైనా పేరొస్తుంది. కష్టపడిన కంటెస్టెంట్ ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. బయట ఎంత పేరున్నా కూడా హౌస్ లో ఎలా ఉంటున్నారు అనేదే కౌంట్ అవుతుంది. అందుకే అమర్ బయట ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా కూడా హౌస్ లో మాత్రం నెగిటివ్ అయిపోయాడు. కానీ, అంబటి అర్జున్ మాత్రం చాలా క్లియర్ క్లారిటీతో హౌస్ లోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. కానీ, తాజాగా అర్జున్ నిజ స్వరూపాన్ని ప్రేక్షకులు చూసి నోరెళ్లబెట్టారు. అర్జున్ మరీ ఇలా ఉన్నాడేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అంబటి అర్జున్ హౌస్ లోకి అడుగు పెట్టాక ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. వచ్చిన వారం కూడా కాకపోయినా.. టాస్కుల్లో ఇరగదీస్తూ పోటుగాళ్లు టీమ్ కి పెద్ద దిక్కుగా మారిపోయాడు. గౌతమ్ కూడా అర్జున్ అన్న అంటూ మనోడి బాటలోనే నడుస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి చాలా సీరియస్ గా ఒక డిస్కషన్ చేశాడు. ఆ దెబ్బతో అసలు అర్జున్ ఎలాంటి వాడు అంటూ ప్రేక్షకులు ఒక క్లారిటీకి వచ్చారు. అయితే ఇది లైవ్ లో చూసిన వాళ్లంతో నెట్టింట అర్జున్ విషయంలో ప్రశ్నలు కురిపిస్తున్నారు. మనసులో ఇంత విషం దాచుకుని అర్జున్ గేమ్ ఆడుతున్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏంటంటే.. అర్జున్ ఏదో పల్లవి ప్రశాంత్ కి ఉచిత సలహా ఇచ్చాడు అంట. అయితే మనోడు మాత్రం ఆ.. చెప్పావులే అన్నట్లు లైట్ తీసుకున్నాడు అంట. ఇంకోముంది.. అంబటి అన్నకి కోపం పొడుచుకొచ్చింది. అదే విషయాన్ని గౌతమ్ దగ్గర కక్కేశాడు. అది కూడా వెర్రి పుష్పం అంటూ నోరు పారేసుకున్నడు.

“ఆ వెర్రిపుష్పం గాడికి ఓ సలహా ఇస్తే లైట్ తీసుకున్నాడు. ఒక టాస్క్ ఏదైనా పడనీ చెప్తా.. మొన్న కలర్ టాస్కులో మొత్తం మడత పెట్టేసి ఉండాల్సింది. ఎందుకు వదిలేశావ్? ఆ టాస్కులో మడతపెట్టేయాల్సింది. అప్పుడు వీడు ఆడతాడు, ఆడతాడు అనే మాటనే ఎగిరిపోయేది” అంటూ అర్జున్ తన మనసులో ఉన్న విషాన్ని కక్కేశాడు. హౌస్ లో టాస్కుల్లో విజయం సాధించాలి అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ, ఇలా టార్గెటెడ్ గా గెలవాలి, మడతపెట్టాలి, తొక్కేయాలి అనే మెంటాలిటీ కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ ని 5 వారాలు తొక్కి పెట్టాలని చాలానే ట్రై చేశారు. కానీ, గోడకు కొట్టిన బంతిలా రెట్టించిన వేగంతో పైకి లేచాడు. బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్ కూడా అయ్యాడు.

మరి.. అర్జున్- ప్రశాంత్ ఏదైనా టాస్కులో ఎదురు పడతారేమో చూడాలి. అప్పుడు అర్జున్ ఏమాత్రం మడతపెడతో తెలుస్తుంది. అయితే ఇదంతా చూసిన ప్రేక్షకులు అర్జున్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు మంచివాడిలా ఉంటూ.. ఒక్కసారిగా అసలు రూపాన్ని చూపించాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రశాంత్ ని ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అర్జున్ కంటే అమర్ చాలా బెటర్ అని చెబుతున్నారు. ఎందుకంటే అమర్ తన మనసులో ఉన్న పైకి చెప్పి టార్గెట్ చేశాడని.. అర్జున్ మాత్రం పైకి మంచిగా ఉంటూ లోపల ఇంత విషం దాచుకున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. పల్లవి ప్రశాంత్ విషయంలో అర్జున్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom