iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ చరిత్రలో ఇంత మంచి సీన్ చూసుండరు! అమర్ హేట్సాఫ్!

  • Published Nov 10, 2023 | 11:01 AM Updated Updated Nov 10, 2023 | 5:22 PM

బిగ్ బాస్ హౌస్ మొత్తం ఫ్యామిలీ వీకెండ్ తో ఎమోషనల్ గా మారిపోయింది. అమర్ దీప్ భార్య తేజశ్వినీ గౌడ హౌస్ లోకి రావడంతో ఎన్నో భావోద్వేగభరిత క్షణాలు ఆడియన్స్ ని కదిలించాయి.

బిగ్ బాస్ హౌస్ మొత్తం ఫ్యామిలీ వీకెండ్ తో ఎమోషనల్ గా మారిపోయింది. అమర్ దీప్ భార్య తేజశ్వినీ గౌడ హౌస్ లోకి రావడంతో ఎన్నో భావోద్వేగభరిత క్షణాలు ఆడియన్స్ ని కదిలించాయి.

  • Published Nov 10, 2023 | 11:01 AMUpdated Nov 10, 2023 | 5:22 PM
బిగ్ బాస్ చరిత్రలో ఇంత మంచి సీన్ చూసుండరు! అమర్ హేట్సాఫ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఫ్యామిలీ వీకెండ్ కావడంతో హౌస్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఒక్కో కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ హౌస్ లోకి వచ్చి వారి ఆట గురించి.. వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పక్కగా చెప్పి వెళ్తున్నారు. అయితే ఆట ఎంత ముఖ్యమే ప్రేక్షకుల అభిమానం పొందడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇప్పటివరకు ఆడిన ఆటకు సంబంధించిన వివరాలను క్లియర్ గా చెప్పి వెళ్తున్నారు. తాజాగా అమర్ దీప్ భార్య తేజశ్వినీ గౌడ కూడా హౌస్ లోకి వచ్చింది. అమర్- తేజూ పార్ట్ ఎంత ఎమోషనల్ గా సాగింది. అలాగే హౌస్ లో ఒక ఆసక్తికర విషయం కూడా జరిగింది.

ఈ సీజన్ లో ఫ్యామిలీ వీకెండ్ ని బిగ్ బాస్ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఒక్కో ఫ్యామిలీ మెంబర్ హౌస్ లోకి వచ్చే దాకా హౌస్ మేట్స్ లో థ్రిల్ అనేది ఉండేలా చూస్తున్నారు. తేజూ హౌస్ లోకి రావడానికి ముందు అమర్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. మీ పుట్టిన రోజు సందర్భంగా మీకు తేజూ కేకు పంపింది అని చెప్పారు. అయితే తాను మాత్రం రాలేకపోయారని.. హౌస్ మేట్స్ తో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ బిగ్ బాస్ చెప్పారు. అమర్ సరేలే.. తేజూ రాకపోయినా కనీసం కేక్ అయినా పంపింది అని అమర్ సంతోషించాడు. ఆ కేకు తీసుకుని బయటకు వచ్చి హౌస్ మేట్స్ కి విషయం చెప్తుండగా అతనికి తేజూ వచ్చిన విషయాన్ని చూపించారు. ఇంక అమర్ నోట మాట రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. తేజూ వచ్చి అమర్ ని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యింది. ఇద్దరూ కూడా కాసేపు ఏం మాట్లడకుండా అలా ఉండిపోయారు. వాళ్లని అలా కాసేపు వదిలేసి హౌస్ మేట్స్ అంతా వెళ్లిపోయారు.

ఆ తర్వాత అమర్ గేమ్ గురించి మాట్లాడుకున్నారు. అమర్ ఆట తీరుపై తేజూ కీలక విషయాలు చెప్పింది. తన కోసం మాత్రమే ఆట ఆడుకోవాలని సూచించింది. ఇక్కడ అందరూ ఇండివిడ్యూవల్ గా ఆడేందుకు వచ్చారనే విషయాన్ని గుర్తు చేసింది. ఏది ఏమైనా కూడా తన కోసం మాత్రమే గేమ్ ఆడాలని సూచించింది. ఇంట్లో ఉన్న అందరినీ ఎంతో అభిమానంతో పలకరించింది. తనతో గొడవల విషయంపై ప్రశాంత్ వచ్చి ఏం అనుకోవద్దు అని చెప్పాడు. అందుకు ఎంతో పాజిటివ్ గా అది గేమ్ మాత్రమే అంటూ చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తించింది. ఆ తర్వాత అమర్ కోసం తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ ని అతనికి ఇచ్చింది. ఇబ్బందిగా ఉన్నా.. గుచ్చుకున్నా కూడా ఎలాగైనా ఆ రింగ్ పెట్టుకోవాలని కోరింది. ఆ తర్వాత అమర్ కోసం ఒక ఫొటో ఫ్రేమ్ కూడా తీసుకొచ్చింది. అందులో వారి పెళ్లి ఫొటో, అమర్ లైఫ్ లో ఉన్న తీపి జ్ఞాపకాలను ఒక ఫ్రేమ్ రూపంలో తీసుకొచ్చింది. ఈ జంట కోసం బిగ్ బాస్ ఒక మంచి పాటను కూడా ప్లే చేశారు. తర్వాత అమర్- తేజూ జంట శివాజీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయమే ఈ సీజన్ లో ఎంతో ఆసక్తిగా అనిపించింది.

ఎందుకంటే.. ఈ సీజన్ చూసిన వాళ్లందరికీ అమర్- శివాజీకి పడదు అనే విషయం తెలుసు. ఎప్పుడూ వీళ్లు ఒకరిని ఒకరు విభేదిస్తూనే ఉంటారు. కానీ, అమర్- తేజూ మాత్రం ఇంటికి పెద్ద శివాజీ అనే ఉద్దేశంతో ఎంతో అభిమానంతో ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం అమర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకుల హృదయాలను కూడా గెలిచేశాడు అంటున్నారు. సాధారణంగా బిగ్ బాస్ అనగానే ఒకరిపై ఒకరు విజయం సాధించాలని.. ఎప్పుడూ స్వార్థం, అసూయ వంటి విషయాలు మాత్రమే కనిపిస్తాయి అనుకుంటారు. కానీ, ఈ ఫ్యామిలీ వీకెండ్ లో మాత్రం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రేమానురాగాలు బయటకు వచ్చేస్తున్నారు. శివాజీతో ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నా కూడా అమర్ చేసిన పని మాత్రం ఎంతో గొప్పది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తేజూకి శివాజీ తన ఫుల్ సపోర్ట్ ప్రకటించాడు. ఏ మాత్రం తోక జాడించినా కూడా కట్ చేసేయ్, నా ఫుల్ సపోర్ట్ నీకే. తొక్క తీసేద్దాం.. చెప్పు ఎప్పుడు కావాలన్నా నేను వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి.. అమర్- తేజూ ఎమోషనల్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom