iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: అమర్ తల్లిపై ప్రశాంత్ ఫ్యాన్స్ బూతులు.. ఎమోషనల్ వీడియో!

  • Published Oct 16, 2023 | 5:13 PM Updated Updated Oct 16, 2023 | 5:32 PM
  • Published Oct 16, 2023 | 5:13 PMUpdated Oct 16, 2023 | 5:32 PM
Bigg Boss 7 Telugu: అమర్ తల్లిపై ప్రశాంత్ ఫ్యాన్స్ బూతులు.. ఎమోషనల్ వీడియో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతోంది. అయితే హౌస్ లో ఆట మాత్రమే కాదు.. బయట ఆట కూడా అంతే ఉల్టాగా ఉంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేసే వాళ్లు.. వాళ్ల ఆటను ప్రమోట్ చేసుకోకుండా ప్రత్యర్థులను కించ పరచడమే పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్స్ కూడా బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఇంట్లో ఆడవాళ్లపై కూడా గలీజ్ కామెంట్స్ చేసేదాకా వచ్చింది. అమర్ దీప్ తల్లి, భార్యపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కించ పరిచే వ్యాఖ్యలు చేశాడు. అందుకు అమర్ దీప్ తల్లి ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.

సాధారణంగా బిగ్ బాస్ అంటే హౌస్ లోకి ఎంతమంది వెళ్లినా కేవలం ఒక్కరు మాత్రమే విన్నర్ గా తిరిగి వస్తారు. తమ వాళ్లని గెలిపించుకునేందుకు బయట ఫ్యాన్స్, పీఆర్ లు పెద్ద యుద్ధాలే చేస్తూ ఉంటారు. అయితే అవి వారి ఆటను ప్రమోట్ చేసుకునేలా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అవి కాస్తా శ్రుతి మించి ఇళ్లలో ఆడవాళ్లను దూషించే వరకు వెళ్తున్నాయి. తాజాగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ ఒకరు అమర్ దీప్ తల్లి, భార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై అమర్ దీప్ తల్లి స్పందిస్తూ ఒక వీడియో చేశారు. ఇలాంటి వారి వల్ల తామకు మానసిక ప్రశాంత లేకుండా పోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి గురించి అలాంటి మాటలు మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఈరోజు మీరు పెట్టిన కామెంట్ మతి ఉండే పెడుతున్నారా?కడుపుకి అన్న తింటున్నారా, గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్ అంటే ఏంటి పైనుంచి దిగి వచ్చాడా? పల్లవి ప్రశాంత్ దగ్గరకు అమర్ తల్లిని, భార్యను పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావ్ రా? రారా బయటకి. పల్లవి ప్రశాంత్ మీద ప్రేమ ఉంటే.. ఓట్లు వేసి గెలింపుచుకోరా. ఇంకోసారి అమర్ వాళ్ల అమ్మని, భార్యను అన్నావంటే ఇంటికొచ్చి కొడతా జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు. అమ్మని మాట్లాడతావా నువ్వు? ఎవర్రా నీకు చదువు చెప్పింది. నీకు సంస్కారం ఉందా? ఏం మాట్లాడుతున్నార్రా? మానసికంగా చంపేస్తున్నారు కదరా. ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు.. చంపేస్తారా? అమ్మని మాట్లాడతావా? నేను నాగార్జున గారు దగ్గరికి వెళ్లి మాట్లాడతా ఇదే విషయం.. జాగ్రత్త గుర్తుపెట్టుకో” అంటూ అమర్ దీప్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom