iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: అమర్ కి కొత్త కష్టం.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా..!

  • Published Oct 09, 2023 | 12:35 PM Updated Updated Oct 09, 2023 | 12:35 PM
  • Published Oct 09, 2023 | 12:35 PMUpdated Oct 09, 2023 | 12:35 PM
Bigg Boss 7 Telugu: అమర్ కి కొత్త కష్టం.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 స్టార్ట్ అయిపోయింది. ఆట ఇప్పటి నుంచి మరింత ఇంట్రెస్టింగ్ గా సాగబోతోంది. ఎందుకంటే హౌస్ లో ఏం జరుగుతోందో.. ఇప్పటివరకు బయటి ఉండి చూసిన వాళ్లు వైల్డ్ కార్డుల ద్వారా రావడం వల్ల ట రసవత్తరంగా మారబోతోంది. వైల్డ్ కార్డ్స్ రూపంలో అంబటి అర్జున్, పూజా మూర్తి, భోలే షావలీ, నయని పావనీ, అశ్వినీ శ్రీ వచ్చారు. వీరిలో అంబటి అర్జున్ పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ల వల్ల హౌస్ లో ఉన్న వారికి పెద్ద కష్టాలే రాబోతున్నాయి. అందరితో పోలిస్తే అమర్ దీప్ కు పెద్ద కష్టమే రాబోతోందని చెప్పాలి.

హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ద్వారా ఇప్పటికే ఉన్న హౌస్ మేట్స్ కు కొత్త ఇంబ్బందులు తప్పవు. ఎందుకంటే బయట ఎవరికి మంచి టాక్ ఉంది. ఎవరు నెగిటివ్ అయ్యి ఉన్నారు. ఎవరితో వైరం పెట్టుకోవాలి? ఎవరితో స్నేహం చేయాలి అనే అన్ని విషయాలు తెలుసుకుని వచ్చారు. ఎవరిని టార్గెట్ చేయాలో వారికి బాగా తెలుసు. ఇప్పటికే బ్యాడ్ ఉన్న వాడిని టార్గెట్ చేస్తే వీళ్లకు ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా బ్యాడ్ ఉన్న వాడిని టార్గెట్ చేసి త్వరగా పంపేస్తే వారికి పోటీ కూడా తగ్గినట్లు అవుతుంది. ఇలాంటి అన్నీ కాలుక్యులేషన్స్ తో కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చుంటారు. పైగా స్టేజ్ మీదే ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు డల్ ఉన్నారు అనే విషయాలను వెల్లడించారు.

బాగా ఆడేవాళ్ల పేర్లలో ప్రశాంత్, యావర్ లాంటి వాళ్ల పేర్లు చెబుతూ వచ్చారు. కానీ, బాగా ఆడని వాళ్లలో మాత్రం దాదాపుగా అందూ అమర్ దీప్ చెప్పారు. అంటే బయట ఎంత నెగిటివిటీ ఉందో వీళ్లకి బాగా తెలుసు. అంతేకాకుండా వీళ్లు గేమ్ ని చాలా బాగా ఫాలో అయ్యే వచ్చారు. ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్ గా అమర్ దీప్ హౌస్ లోకి వచ్చాడు. కాబట్టి ఈ ఛాన్స్ ని వాడుకుని అతను పుంజుకునే లోపు అమర్ ని టార్గెట్ చేస్తే వీళ్లకు ఆట ఈజీ అవుతుంది. మరి.. ఆ పాయింట్ ని ఎవరు పాటించినా లేకపోయినా అర్జున్ పాటించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అర్జున్.. అమర్ తో క్లోజ్ గా లేడు. పైగా స్టేజ్ మీద మాట్లాడుతూ అమర్ అసలు ఇలా ఆడతాడని ఎవరూ ఊహించలేదు. పాయింట్ లేకుండా లాగి లాగి గోల చేస్తున్నాడు అని చెప్పాడు. మిగిలిన వాళ్లు కూడా అమర్ గురించి అలాంటి ఒక ఒపీనియన్ షేర్ చేసుకున్నారు.

తాజాగా హౌస్ లో ఆరోవారం నామినేషన్స్ లో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. కొత్తగా వచ్చిన వాళ్లు మాత్రమే నామినేషన్స్ చేయాలి. ఐదుగురు ఒక్కొక్కళ్లు ఇద్దరిని చొప్పున నామినేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్లు స్టేజ్ మీద ఎవరు అయితే బాగా ఆడటం లేదు అని చెప్పారో.. దాదాపుగా వారినే నామినేట్ చేశారు. నామినేషన్స్ లో ఉన్న వాళ్లను చూస్తే.. అమర్, తేజ, శోభా, సందీప్ లకు పడ్డాయి. స్టేజ్ మీద వీళ్ల పేర్లను దుమ్ము ప్లేయర్స్ గా చెప్పారు. అలాగే హౌస్ లో ఉన్న వాళ్లలో అమర్ దీప్ ఇంకా పుంజుకోవడానికి చాలానే కష్టపడుతున్నాడు. నిజానికి ఇతని గురించి ఊహించుకుంది వేరు.. అతను ఆడుతోంది వేరు. ఓవరాల్ గా వైల్డ్ కార్డుల వల్ల అమర్ కే ఎక్కువ కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి.. అమర్ కు వైల్డ్ కార్డుల వల్ల కష్టాలు తప్పవా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet