iDreamPost
android-app
ios-app

అమర్ పై మాటలు జారుతూనే ఉన్న శివాజీ.. ఇదేనా సీనియారిటీ?

  • Published Nov 02, 2023 | 12:47 PM Updated Updated Nov 02, 2023 | 12:47 PM

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఆట వాళ్లే ఆడాలి. ఇది ఇండివిడ్యూవల్ గేమ్. కానీ, అమర్ దీప్ ఎప్పుడూ శివాజీ సపోర్ట్ చేయడం లేదు అంటాడు. శివాజీనేమో యావర్, ప్రశాంత్ ని గెలిపిస్తాను అంటాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఆట వాళ్లే ఆడాలి. ఇది ఇండివిడ్యూవల్ గేమ్. కానీ, అమర్ దీప్ ఎప్పుడూ శివాజీ సపోర్ట్ చేయడం లేదు అంటాడు. శివాజీనేమో యావర్, ప్రశాంత్ ని గెలిపిస్తాను అంటాడు.

  • Published Nov 02, 2023 | 12:47 PMUpdated Nov 02, 2023 | 12:47 PM
అమర్ పై మాటలు జారుతూనే ఉన్న శివాజీ.. ఇదేనా సీనియారిటీ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో గ్రూప్ గేమ్ జరుగుతన్న విషయాన్ని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు గ్రూపులుగా హౌస్ లో గేమ్ జరుగుతోంది. ఒక టీమ్ కి శివాజీ హెడ్ గా ఉన్నాడు. మరో టీమ్ లో అమర్ అండ్ కో ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఒకసారి ఆ టీమ్.. ఒకసారి ఈ టీమ్ లో ఉంటూ ఉంటారు. శివాజీ టీమ్ లో మాత్రం యావర్, ప్రశాంత్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. ఈ విషయం తర్వాత మొదటి నుంచి హౌస్ లో మారకుండా ఉన్న ఒకే ఒక విషయం అమర్ దీప్ – శివాజీ మధ్య వైరం. 60 రోజులు పూర్తైనా కూడా వారి మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది.

శివాజీకి అమర్ అంటే పడదు.. అమర్ కి శివాజీ అంటే పడదు. ఈ విషయం బిగ్ బాస్ చూస్తున్న అందరికీ తెలుసు. ఏ కారణం ఉన్నా లేకపోయినా.. ప్రతివారం వీళ్లు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూనే ఉంటున్నారు. అమర్ దీప్ ఎప్పుడూ ఒకటే ప్రశ్న.. అందరినీ సపోర్ట్ చేసే ఆయన నన్ను ఎందుకు సపోర్ట్ చేయడు. నేను అనగానే ఎందుకు ఒంటికాలిపై వస్తున్నాడు? అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు. నిజానికి అమర్ దీప్ అలా అనుకోకుండా ఉండాలి. ఎందుకు అంటే బిగ్ బాస్ అనేది ఇండివిడ్యూవల్ గేమ్ ఈ గేమ్ లో ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు. ఒకవేళ ఇంకొకరి సపోర్ట్ కోరుకుంటున్నావ్ అంటే నిన్ను నువ్వు వీక్ అని ఒప్పుకుంటున్నట్లే. ఆ విషయాన్ని అమర్ దీప్ అర్థం చేసుకోవడం లేదు.

మరోవైపు శివాజీ కూడా మరీ అమర్ ని టార్గెట్ చేస్తున్నాడు అంటూ అమర్ దీప్ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా మానస్ కూడా అందరినీ సపోర్ట్ చేసే శివాజీ.. అమర్ ని మాత్రం సపోర్ట్ చేయడు అంటూ చెప్పుకొచ్చాడు. అది శివాజీ స్ట్రాటజీ అంటూ చెప్పుకొచ్చాడు. సపోర్ట్ చేయడం చేయకపోవడంపై ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, శివాజీ అంటున్న మాటలపై మాత్రం అమర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి అమర్ విషయంలో ఏదొక మాట అంటూనే ఉన్నాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎపిసోడ్ లో అమర్ ఇలా అన్నాడు అంటూ యావర్ ఒక విషయాన్ని శివాజీకి చెప్పాడు. అందుకు శివాజీ రియాక్ట్ అవుతూ “వాడు వేస్ట్ రా వదిలేయ్.. వాడు మారడు వాడు వేస్ట్ గాడు” అంటూ నోరు పారేసుకున్నాడు.

నిజానికి ఒక వ్యక్తి గురించి ఒక రియాలిటీ గేమ్ లో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు అమర్ గురించి ఎందుకు ఇలా నోరు జారుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ శివాజీ.. అమర్ గురించి కొన్ని మాటలు అంటూనే ఉన్నాడు. శివాజీ ఆట ఆడించడం సంగతి పక్కన పెడితే గతంలో టేస్టీ తేజా, సందీప్ విషయంలో కూడా ఇలాగే నోరు పారేసుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ కు హితబోధ చేస్తూ.. బొ*, భోషాణం అంటూ మాటలు జారాడు. మరి.. అమర్ దీప్ ని వేస్ట్ అంటూ శివాజీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom