iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: అర్జున్ కాళ్లు మొక్కిన అమర్ దీప్.. ఆ స్నేహం ఏమైంది?

  • Published Oct 14, 2023 | 12:19 PM Updated Updated Oct 14, 2023 | 12:19 PM
  • Published Oct 14, 2023 | 12:19 PMUpdated Oct 14, 2023 | 12:19 PM
Bigg Boss 7 Telugu: అర్జున్ కాళ్లు మొక్కిన అమర్ దీప్.. ఆ స్నేహం ఏమైంది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0లో ఆట ఆసక్తిగా మారుతోంది. ప్రిన్స్ యావర్ హౌస్ కి రెండో కెప్టెన్ అయ్యాడు. హౌస్ మేట్ కావడానికి ఎంతో కష్టపడిన యావర్ ఆఖరికి రెండోవారం కెప్టెన్ అయిపోయాడు. యావర్ ను పదే పదే వెనక్కి లాగిన సభ్యులు కూడా చప్పట్లు కొడుతూ కెప్టెన్ బ్యాడ్జ్ ని పెట్టారు. ఇదంతా బాగానే ఉన్నా.. అమర్ దీప్- అర్జున్ అంబటి మధ్య ఏం జరుగుతోందో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. ఇంకొందరు అయితే అంబటి అర్జున్ మిత్రుడికి వెన్నుపోటు పొడిచాడు అంటూ ఓల్డ్ వీడియో వైరల్ చేస్తున్నారు. మరి.. నిజంగానే అమర్ కు అర్జున్ వెన్నుపోటు పొడిచాడా?

‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’.. ఈ సామెత గుర్తుపెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. అంబటి అర్జున్- అమర్ దీప్ ఇంద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అమర్ దీప్ తన పెళ్లిరోజు భార్యతో సహా అర్జున్ దగ్గర ఆశ్వీర్వాదం తీసుకున్నాడు. ఆ వీడియో చూస్తే అర్జున్- అమర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే అర్జున్ హౌస్ లోకి రాగానే అమర్ దీప్ ఎంతో ఆనందించాడు. కానీ, అంబటి అర్జున్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అసలు అమర్ దీప్ ని పట్టించుకోవడం లేదు. పైగా వచ్చిన రెండో రోజే అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. అపార్థం చేసుకోవద్దు అంటూ ముందే చెప్పాడు. పైగా గేమ్స్ లో అసలు అమర్ కి హెల్ప్ చేయడం లేదు. తాజాగా కెప్టెన్సీ టాస్కులో అమర్ దీప్ కి అవకాశం ఇవ్వకుండా టేస్టీ తేజాకి ఛాన్స్ ఇచ్చాడు. అదే అమర్ కి అవకాశం ఇచ్చుంటే కచ్చితంగా కెప్టెన్ అయ్యే అవకాశం ఉండేది అంటూ అమర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇవన్నీ చూసిన తర్వాత అంబటి అర్జున్- అమర్ దీప్ కి వెన్నుపోటు పొడిచాడు అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే బిగ్ బాస్ అనేది ఇండివిడ్యూవల్ గేమ్. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎవరి ఆట వాళ్లు ఆడాలి. అలా కాదని ఒకరికి ఒకరికి సహాయం చేసుకుంటూ కూర్చుంటే అది ఫేక్ గేమ్ అంటూ కామెంట్స్ చేస్తారు. అదే అమర్ తో కలిసి గేమ్ ఆడితే వీళ్లు బయటే మాట్లాడుకుని వచ్చారు.. అమర్- అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ట్రోల్ చేస్తారు. అందుకే అర్జున్ తన ఆట తాను ఆడుతున్నట్లు కనిపించింది. కానీ, చాలా మందికి అర్థంకాని విషయం ఏంటంటే అంబటి అర్జున్ సీరియల్ బ్యాచ్ తోనే ఉన్నాడు. ఆ విషయం చాలా మందికి అర్థం కావడం లేదు. అలా అనడానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అర్జున్ హౌస్ లోకి వచ్చాక.. నామినేషన్ సమయంలో అమర్ దీప్ ఆట తీరు ఎలా ఉందో హింట్ ఇచ్చాడు. ఇలా అయితే చాలాకష్టం అని చెప్పుకొచ్చాడు. కానీ, ఆ మాటలను అర్థం చేసుకునే మెచ్యురిటీ అమర్ దగ్గర కనిపించలేదు.

బిగ్ బాస్ హౌస్ లో అమర్ టార్గెట్ ఎవరు? శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్. ఇప్పుడు అర్జున్ టార్గెట్ కూడా వాళ్లే. గౌతమ్ తో మాట్లాడుతూ ప్రశాంత్ ని మడతపెట్టాల్సింది అన్నాడు. అలాగే కెప్టెన్సీ టాస్కులో అవకాశం ఉన్న సమయంలో అన్నీ వాళ్ల మిత్రుల పేర్లే చెప్పాడు. అర్జున్ ఒక్కడే ఆడుతున్నాడు.. కానీ, వాళ్ల మిత్రులకు ఉపయోగపడే ఆటే ఆడుతున్నాడు. అంటే అర్జున్.. అమర్ కి హెల్ప్ చేస్తున్నాడు అనే కదా? కాకపోతే ఆ విషయాన్ని అమర్.. అతని ఫ్యాన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అని చెప్పుకున్నాం కదా. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ కి విన్నర్ ఒకరే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరూ మిత్రులు కాదు.. అందరూ శత్రువులే అవుతారు. కాబట్టి అమర్ కి అర్జున్ వెన్నుపోటు పొడిచాడు అనుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. అలాగని అర్జున్ కూడా మాస్కు లేకుండా ఆడుతున్నాడు అనడానికి లేదు. మరి.. అర్జున్- అమర్ కి వెన్నుపోటు పొడిచాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by biggboss 7 telugu (@biggboss_chelli)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio