iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: అమర్ త్యాగం.. ఓవర్ యాక్షన్ అంటూ నెట్టింట సెటైర్లు!

  • Published Oct 07, 2023 | 2:12 PM Updated Updated Oct 07, 2023 | 2:12 PM
  • Published Oct 07, 2023 | 2:12 PMUpdated Oct 07, 2023 | 2:12 PM
Bigg Boss 7 Telugu: అమర్ త్యాగం.. ఓవర్ యాక్షన్ అంటూ నెట్టింట సెటైర్లు!

బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ తొలి కెప్టెన్ అయ్యాడు. మొదటి నుంచి అందరూ తక్కువ అంచనా వేయగా.. ప్రశాంత్ మాత్రం టాస్కుల్లో తన ఆట ఆడుకుంటూ పోతున్నాడు. అలాగే హౌస్ మేట్ అయ్యాడు, కంటెండర్ అయ్యాడు, ఇప్పుడు తొలి కెప్టెన్ అయ్యాడు. నిజానికి గౌతమ్ తో కలిసి ప్రశాంత్ పోటీ పడుతున్నప్పుడు ఆట కాదు.. అది వేట అంటూ నెట్టింట ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఎప్పుడూ ప్రశాంత్ ని టార్గెట్ చేస్తున్నాడు అని పేరు తెచ్చుకున్న అమర్ మాత్రం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాడు.

హౌస్ లో మొదటి నుంచి అమర్- ప్రశాంత్, అమర్- శివాజీలకు పడటం లేదు. అయితే ప్రశాంత్ ని అమర్ చాలా సందర్భాల్లో టార్గెట్ కూడా చేశాడు. కానీ, పల్లవి ప్రశాంత్ మాత్రం ఆట ఆడుతూ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. అయితే అమర్ పై ఇప్పుడు ట్రోలింగ్ చేయడానికి కారణం ఏంటంటే.. లెటర్ త్యాగం చేసినప్పుడు అతను ఏడవడమే. చిట్టీ యాయీరే టాస్కులో రూమ్ లోకి వెళ్లక ముందే నాకు లెటర్ కావాలి.. అమ్మ హెల్త్ ఎలా ఉందో కనుక్కోవాలి అంటూ సందీప్ చెప్పాడు. అందుకు అమర్ బయటే దాదాపుగా ఒప్పేసుకున్నాడు. అమ్మ అని చెప్పినప్పుడు ఏం చేయలేం.. త్యాగం చేయాల్సిందే అని ఫిక్స్ కూడా అయ్యాడు. లోపలికి వచ్చిన తర్వాత సందీప్ అమ్మ ఆరోగ్యం అంటూ ఏడుస్తున్నాడు. అమర్ కూడా తన పాయింట్స్ చెబుతూ ఉన్నాడు. తేజాని సరిగ్గా చూసుకుంటున్నానో లేదో కూడా నాకు తెలియదు. అసలు నేను ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వను అనుకుంటుంది. ఈ లెటర్ చూడగానే ఆమే పిలిచినట్లు ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాడు.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత లెటర్ ఇచ్చేయాలి అని ముందే ఫిక్స్ అయ్యాక అక్కడ ఎందుకు అంతసేపు సీన్ చేశాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అమర్ నిజంగా ఏడవలేదని.. కంటెంట్ కోసమే అంతసేపు సీన్ క్రియేట్ చేశాడు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మైక్ తీసేయడం, చేతులు నేలకేసి కొడుతూ ఏడవడం, షడ్డర్ లో లెటర్ పెట్టినప్పుడు కేకలు వేయడం ఇవన్నీ చూసిన తర్వాత అమర్ జెన్యూన్ గా లేడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. లెటర్ త్యాగం చేసి, కంటెండర్ షిప్ వదులుకున్నా కూడా అమర్ కి మాత్రం ట్రోలింగ్ తప్పడం లేదు. అంతేకాకుండా టాస్కు జరుగుతున్న సమయంలో కూడా అమర్ చాలానే మాటలు మాట్లాడాడు. జనాలు చూస్తే.. నేనే ఎల్లుండి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతాను అంటూ కామెంట్స్ చేశాడు.

అంతేకాకుండా టాస్కు అయిపోయాక నేను ఒక వ్యర్థ పరదార్థాన్ని అంటూ ముఖానికి ఎరుపు రంగు పూసుకుని కూర్చున్నాడు. ఇన్నాళ్లు ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ అమర్ నెగిటివిటీని మూట కట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి మాటలు, చేష్టలతో మరింత బ్యాడ్ అవుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అమర్ తన ప్రవర్తన మార్చుకోకపోతే సీజన్ అయ్యేలోపు.. చాలా బ్యాడ్ అయిపోతాడు. వీకెండ్ లో లెటర్ కోల్పోయిన వారికి వాటిని అందిస్తారు అని చెబుతున్నారు. మరి.. తేజు నుంచి లెటర్ వచ్చాక అయినా అమర్ నార్మర్ అవుతాడేమో చూడాలి. అమర్ దీప్ చౌదరి ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş