iDreamPost
android-app
ios-app

రైతు బిడ్డ ట్యాగ్ పై వార్.. ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సార్థక్!

  • Published Sep 12, 2023 | 4:02 PM Updated Updated Sep 12, 2023 | 4:06 PM
  • Published Sep 12, 2023 | 4:02 PMUpdated Sep 12, 2023 | 4:06 PM
రైతు బిడ్డ ట్యాగ్ పై వార్.. ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సార్థక్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లో రైతు బిడ్డ ట్యాగ్ పై వార్ మొదలైంది. నిజానికి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పుకోవడంపై సెలబ్రిటీలు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎవరూ నేరుగా ప్రశాంత్ కి చెప్పింది లేదు. కానీ, నామినేషన్స్ లో రైతు బిడ్డ ట్యాగ్ పై గట్టిగానే వార్ జరిగింది. హౌస్ లో ఉన్న అందరూ ప్రశాంత్ రైతు బిడ్డ అని పదే పదే చెప్పుకోవద్దు అంటూ కామెంట్ చేశారు. అదే పాయింట్ పై నామినేట్ కూడా చేశారు. పల్లవి ప్రశాంత్ ని ముగ్గురు కంటెస్టెంట్స్ తప్ప అందరూ నామినేట్ చేశారు. ఆట, మాట అన్నీ మారాలంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయింది. ఈ నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామంది ఇది కదా బిగ్ బాస్ అంటే.. ఇది ఆడియన్స్ కి కావాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు స్టాండ్ తీసుకుంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొందరు పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తుంటే.. ఇంకొందరు అసలు అమర్ దీప్ చెప్పిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నామినేషన్స్ తో ఇంట్లోనే కాదు.. బయట కూడా రచ్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్ ని ఒక్కడిని చేసి అందరూ టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కావాలనే తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అమర్ దీప్ ని సపోర్ట్ చేసే వాళ్లు కూడా లేకపోలేదు. అసలు అమర్ దీప్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అందరు కష్టపడతారు.. ఆ విషయాన్ని కూడా అడ్రస్ చేయమని చెబుతున్నాడు అంతే కదా అంటూ స్పందిస్తున్నారు.

కంటెస్టెంట్స్ మాత్రం సింపథీ కార్డు వాడకు.. స్ట్రైట్ గేమ్ ఆడు అంటూ పల్లవి ప్రశాంత్ కు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న ప్రశాంత్ వేరు.. నామినేషన్స్ లో మీరు చూసిన ప్రశాంత్ వేరు అనే భావన కలగకమానదు. ప్రశాంత్ బయట పక్కాగా సెట్ చేసే వచ్చాడు అంటూ హౌస్ మేట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్ లోకి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ అడుగుపెట్టాడు. అఖిల్ కు బిగ్ బాస్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ 4, బిగ్ బాస్ ఓటీటీ సీజన్స్ లో రన్నర్ గా నిలిచాడు. అలాంటి అఖిల్ సార్థక్ బిగ్ బాస్ గురించి స్పందించగానే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Bigg bose fame akhil comments on pallavi prashanth

అఖిల్ సార్థక్ పల్లవి ప్రశాంత్ కు మద్దతుగా నిలిచాడు. అందరూ కలిసి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు అన్నాడు. “అతను ఒక రైతు కాబట్టే ప్రశాంత్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. వాళ్ల పాయింట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ, ప్రశాంత్ కి అవకాశం కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. అన్నీ సీజన్స్ చూసి వచ్చి ఆడుతున్నాడు అంటున్నారు. బిగ్ బాస్ అంటే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు కచ్చితంగా సీజన్స్ చూస్తారు. అలా చూసి రావడంలో ఎలాంటి తప్పు లేదు. అందరూ సీజన్స్ చూసి వచ్చినవాళ్లే.. ఎవరి కంటెంట్ ని వాళ్లు క్రియేట్ చేసుకుంటున్నారు. ట్రాక్స్ అన్నీ ఎటు దారితీస్తాయో అందరికీ తెలుసు. ఈ సీజన్ నిజంగానే ఉల్టా పుల్టాగా ఉంది. సాధారణంగా ఆర్టిస్ట్స్ మనం.. మనకే బిగ్ బాస్ అంటే ఎంతో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాంటిది అతను పల్లెటూరు నుంచి వచ్చాడు. అతను ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు.

లవ్ ట్రాక్ తో కంటెంట్ ఫన్నీగా క్రియేట్ చేయచ్చు అని భావించి ఉండచ్చు. కానీ, అది అంత మంచిగా లేదు. కానీ, అతను ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు. మీరందరూ ఎలా అయితే ఆడుతున్నారో అలాగే అతను కూడా ట్రై చేస్తున్నాడు. అందులో అసలు తప్పేముంది. మీలో చాలామంది అతని గురించి బాగానే రీసెర్చ్ చేసి వచ్చినట్లు ఉన్నారు. అయితే అతనికి అలాంటి వాటిలో అసలు ఇంట్రెస్ట్ లేదు” అంటూ అఖిల్ సార్థక్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకొచ్చాడు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ కు అఖిల్ సార్థక్ సపోర్ట్ ఉందని అర్థమైపోయింది. మరి.. ఈ వారం హౌస్ లో ప్రశాంత్ ఎలాంటి గేమ్ ఆడతాడు అనే దానిపైనే అతని బిగ్ బాస్ భవిష్యత్ ఆధారపడి ఉంది. పల్లవి ప్రశాంత్ కి అఖిల్ సార్థక్ సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş