iDreamPost
android-app
ios-app

Big boss 7: శివాజీకి అనారోగ్యం! చికిత్స కోసం హౌస్ నుండి బయటకి!

  • Published Oct 15, 2023 | 11:57 PM Updated Updated Dec 09, 2023 | 5:43 PM

ఆ క్రేజ్ తోనే శివాజీ బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఉన్న యంగ్ జనరేషన్ కి కాంపిటేటర్ గా ఎంత వరకు సక్సెస్ అవుతారు అని మొదట్లో ఆయనపై చాలానే అనుమానాలు వచ్చాయి. కానీ.. వాటి అన్నిటినీ దాటుకుని హౌస్ లో బెస్ట్ గేమ్ ఆడుతున్నారు శివాజీ.

ఆ క్రేజ్ తోనే శివాజీ బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఉన్న యంగ్ జనరేషన్ కి కాంపిటేటర్ గా ఎంత వరకు సక్సెస్ అవుతారు అని మొదట్లో ఆయనపై చాలానే అనుమానాలు వచ్చాయి. కానీ.. వాటి అన్నిటినీ దాటుకుని హౌస్ లో బెస్ట్ గేమ్ ఆడుతున్నారు శివాజీ.

Big boss 7: శివాజీకి అనారోగ్యం! చికిత్స కోసం హౌస్ నుండి బయటకి!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోగా తనను తాను నిరూపించుకున్న స్టార్ శివాజీ. ఆయన సినీ కెరీర్ అనుకోని విధంగా చాలా తొందరగా ముగిసినా.. పొలిటికల్ గా చాలా యాక్టివ్ అయ్యి.. ప్రజలకి దగ్గరగా ఉంటూ వచ్చారు. ఆ క్రేజ్ తోనే శివాజీ బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఉన్న యంగ్ జనరేషన్ కి కాంపిటేటర్ గా ఎంత వరకు సక్సెస్ అవుతారు అని మొదట్లో ఆయనపై చాలానే అనుమానాలు వచ్చాయి. కానీ.. వాటి అన్నిటినీ దాటుకుని హౌస్ లో బెస్ట్ గేమ్ ఆడుతున్నారు శివాజీ. కేవలం టాస్క్ ల విషయంలోనే గాక, కుర్రాళ్ళకి మంచి, చెడు నిర్దేశిస్తూ.. ఓ పెద్ద మనిషిగా గుర్తింపు దక్కించుకున్నారు.

ఇక ఇప్పటికే సగం సీజన్ పూర్తి చేసుకున్న శివాజీ కచ్చితంగా ఫైనల్ లిస్ట్ లో ఉంటారని అంతా భావిస్తూ వచ్చారు. కానీ.. ఇలాంటి సమయంలో ఆయన సడెన్ గా హౌస్ నుండి బయటకి వచ్చేయాల్సి రావడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం శివాజీ హౌస్ లోకి వెళ్లక ముందు నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక.. ఆ సమస్యలు మరోసారి తిరగబెట్టాయట. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఆయన.. ఒకటికి.. రెండు సార్లు తనని బయటకి పంపించమని వేడుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బయటకి చెప్పుకోలేకనే శివాజీ అలా ప్రవర్తించారని సమాచారం.

కాగా.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఇంకాస్త చెడి పోవడంతో శివాజీ హౌస్ నుండి బయటకి వచ్చేశారు. మెరుగైన వైద్యం అందాక.. ఆయన కోలుకుంటే.. మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అందుకోసం మూడు రోజులు చూస్తారని.. సెట్ అవ్వకపోతే పర్మినెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే అని సమాచారం. సీజన్ 4లో నోయెల్, సీజన్ 5లో జెస్సీలానే శివాజీకి కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నోయెల్, జెస్సీలకి కూడా హెల్త్ బాగాలేని కారణంగా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు శివాజీ ఆరోగ్యం 3 రోజుల్లో కుదుటపడకపోతే ఇక శాశ్వతంగా బిగ్ బాస్ నుంచి బయటకెళ్లిపోతారని సమాచారం. మరి.. ఇంత మంచిగా గేమ్ ఆడుతున్న శివాజీ ఇలా అనారోగ్యంతో హౌస్ నుండి బయటకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap