iDreamPost
android-app
ios-app

అన్నం మీద ఒట్టేసి.. అన్నీ అబద్ధాలు చెప్పిన శివాజీ!

  • Published Nov 18, 2023 | 1:36 PM Updated Updated Nov 18, 2023 | 1:36 PM

బిగ్ బాస్ హౌస్ లో శివాజీని అందరూ పెద్ద దిక్కులా భావిస్తున్నారు. ఆయన ఏదైనా చెబితే ఇట్టే నమ్మేస్తున్నారు. అయితే అలాంటి శివాజీ తాజా ఎపిసోడ్ లో మాటలు మారుస్తూ ఎన్ని అబద్ధాలు ఆడాడో చూడండి.

బిగ్ బాస్ హౌస్ లో శివాజీని అందరూ పెద్ద దిక్కులా భావిస్తున్నారు. ఆయన ఏదైనా చెబితే ఇట్టే నమ్మేస్తున్నారు. అయితే అలాంటి శివాజీ తాజా ఎపిసోడ్ లో మాటలు మారుస్తూ ఎన్ని అబద్ధాలు ఆడాడో చూడండి.

  • Published Nov 18, 2023 | 1:36 PMUpdated Nov 18, 2023 | 1:36 PM
అన్నం మీద ఒట్టేసి.. అన్నీ అబద్ధాలు చెప్పిన శివాజీ!

బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ గా ప్రియాంక జైన్ గెలిచింది. హౌస్ మేట్స్ చాలామంది కష్టపడి ఆమెను గెలిపించుకున్నారు. ఈ ఆటలో అమర్ కు ఇంటి సభ్యుల నుంచి సపోర్ట్ దక్కలేదనే చెప్పాలి. ఛాలెంజ్ మొత్తం దాదాపుగా ఏకపక్షంగానే సాగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అప్పుడు శోభా- శివాజీకి ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ గొడవ గురించి చాలానే చర్చ జరిగింది. శివాజీ కూడా తన వాదనను చాలా బలంగానే వినిపించాడు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది? తాను గెలవనని ముందే తెలుసు అనేసిన శివాజీ.. అసలు ఈ గొడవ ఎందుకు పెట్టుకున్నాడు? ఆ తర్వాత అన్ని మాటలు ఎందుకు మార్చాడు?

ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం యావర్ చివరి ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. అతను ఆ టాస్కులో శివాజీ, ప్రియాంకతో తలపడ్డాడు. ఆ ఛాలెంజ్ కి శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ సంచాలకులుగా వ్యవహరించారు. తమ నిర్ణయం చెప్పే సమయంలో రూల్స్ కి తగ్గట్లు చెప్పండి అనేసరికి వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇద్దరూ కలిసి చాలాసేపు చర్చించుకున్నారు, వాదించుకున్నారు, మల్లగుల్లాలు పడ్డారు. అయితే విన్నర్ అనౌన్స్ చేసే సమయంలో శోభా- శివాజీకి గొడవ జరిగడం అందరూ చూశారు. తాను ఎందుకు అరవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. విన్నర్ యావర్ అని అనౌన్స్ చేసిన తర్వాత శోభాకి థాంక్స్ అని చెప్పాడు. అప్పుడు శోభా కూడా తగులుకుంది. ఎందుకు అన్న థాంక్స్ అంటూ ప్రశ్నించింది. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్ అందుకే అంటూ చెప్పాడు. ఒకటి కాదు.. రెడు కాదు.. మూడుసార్లు నువ్వు సంచాలక్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం.

నేను ఈ గేమ్ గురించి చెప్పలేదు. నేను ఏమైనా పిచ్చోడ్నా ఈ గేమ్ లో నేను ఎందుకు గెలుస్తాను? నాకు తెలీదా? నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని నిన్ను అలర్ట్ చేశాను అంటూ ఫ్లేట్ తిప్పేశాడు. అయితే తాను గెలవను అనుకున్నప్పుడు ఇంత గొడవ ఎందుకు చేసినట్లు? అక్కడితోనే అంతా షాకైతే.. ఆ తర్వాత నేను గెలవనని తెలిసే బాల్ పడేశాను అంటూ ఇంకోసారి ప్లేట్ ఫిరాయిండు. నిజానికి శివాజీ ఎక్కడా కూడా ఆట ఓడిపోవాలి అనే ఉద్దేశంతో ఆడలేదు. ప్రతినిమిషం గెలవాలి అనే కసితోనే ఆడాడు. డిస్టర్బ్ చేయద్దు అంటూ ప్రశాంత్ తో గొడవ కూడా పెట్టుకున్నాడు. శోభాని అరవద్దు అంటూ కేకలు కూడా వేశాడు. చివర్లో తాను ఓడిపోయాననే కోపంతో బాల్ ని నేలకు వేసి కొటాడు. చివర్లో మాత్రం తాను అసలు గెలవడం కోసమే ఆడలేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ దగ్గర డిస్కషన్ స్టార్ట్ చేశాడు. నన్ను పక్కన పెట్టారు అని నిన్ను అరిచాను అనుకున్నావా? అని అడిగాడు. అందుకు ప్రశాంత్ అలా ఏం లేదన్నా అన్నాడు. మళ్లీ నాకు ఆ మాట రాకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.

నిజానికి ప్రశాంత్ ని డిస్టర్బ్ చేయకు అని ఇరిచిందే తాను ఓడిపోతున్నాను అని. తనని ఓడిపోయేలా చేశారు అనే వాళ్ల మీద అరిచాడు. మళ్లీ వచ్చి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. అటుగా వెళ్తున్న శోభాని పిలిచి నేను నాకోసం ఫైట్ చేశాను అనుకున్నావా శోభా అంటూ అడిగాడు. ఆమె అందుకు అంతేగా అన్నా అంది. ఏయ్ థూ అలా ఏం కాదు. థూ..థూ.. నేను కరెక్ట్ నిర్ణయం కోసం అలా చేశాను అంటూ కవర్ డ్రైవ్ వేశాడు. అందుకు శోభా మాత్రం ఏమో అన్న నాకు మాత్రం అలాగే అనిపించింది. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా అదే చెప్తాను అంది. దాంతో పొయ్యి మీద వంట చేస్తుంటే.. తినే అన్నమీద ఒట్టేసి చెబుతున్నా అంటూ అనేశాడు. ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్లీ చివరకు అన్నం మీద కూడా ఒట్టేశాడు. మొత్తానికి శివాజీ తనని తానే పనికట్టుకుని ఈ ఎపిసోడ్ లో బ్యాడ్ చేసుకున్నాడు. మరి.. శివాజీ ఇన్నిసార్లు ప్లేట్ ఫిరాయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom