iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: కావాలనే సందీప్ ని నెగిటివ్ చేస్తున్నారు: సందీప్ భార్య జ్యోతి

  • Published Oct 10, 2023 | 3:51 PM Updated Updated Oct 10, 2023 | 3:51 PM
  • Published Oct 10, 2023 | 3:51 PMUpdated Oct 10, 2023 | 3:51 PM
Bigg Boss 7 Telugu: కావాలనే సందీప్ ని నెగిటివ్ చేస్తున్నారు: సందీప్ భార్య జ్యోతి

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వల్ల ఎంతో మంది స్టార్లు, హీరోలు, పెద్ద పెద్ద యాంకర్స్, యాక్టర్స్ కి కెరీర్ లో సెకండ్ ఛాన్స్ దొరిగింది. అలాగే సోషల్ మీడియా స్టార్లు, చిన్న చిన్న సెలబ్రిటీలకు బిగ్ బాస్ వల్ల వెండితెర, బుల్లితెర మంచి లైఫ్ దక్కింది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల ఎంతోమందికి ఎక్కడలేని నెగిటివిటీ దక్కింది. కొంతమంది పరిస్థితి అయితే.. బయట వాళ్లను ఆరాధించే ఫ్యాన్స్ చీదరించుకునే వరకు వెళ్లింది. ఇంకొంతమంది అయితే ప్రేమకు కూడా పుల్ స్టాప్ పెట్టేశారు. ఇలా చాలామంది లైఫ్ చాలా విధాలుగా టర్న్ తీసుకుంది. అయితే ఇదంతా ఆటలో భాగంగా జరిగితే బాగానే ఉంటుంది. కానీ, కొందరు పని కట్టుకుని చేస్తేనే బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి విషయంపైనే ఆట సందీప్ భార్య జ్యోతి కీలక వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో తొలి హౌస్ మేట్ అయి.. ఫస్ట్ పవరాస్త్రాన్ని అందుకున్న వ్యక్తి ఆట సందీప్. తొలివారమే పవరాస్త్రం రావడంతో సందీప్ కు పెద్దగా టాస్కులు ఆడే అవకాశం రాలేదు. కేవలం సంచాలక్ గానే మిగిలిపోయాడు. అందులో కూడా కొన్ని తప్పుల వల్ల నాగార్జున చేతిలో క్లాస్ పీకించుకున్నాడు. వరస్ట్ సంచాలక్ అనే బిరుదు కూడా అందుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సందీప్ ప్లేయర్ గా మారాడు. అమర్ తో కలిసి టాస్కులు కూడా ఆడాడు. కానీ, చిన్న తప్పులు, అతి తెలివి నిర్ణయాల వల్ల మళ్లీ సందీప్- అమర్ లకు హోస్ట్ గట్టిగానే క్లాస్ పీకారు. ఇలా కొన్ని సొంత నిర్ణయాలు, కొన్ని అమర్ మిస్ గైడ్ చేసినవి అన్నీ కలిపి సందీప్ కు చాలానే నెగిటివిటీ వచ్చింది. సంచాలక్ గా ఉన్నప్పుడు ఒకలా.. కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు ఒకలా చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఆట సందీప్ పై నెగిటివిటీ కూడా బాగా పెరిగింది. అయితే ఇలా అవ్వడం వెనుక పీఆర్ స్టంట్ ఉందంటూ సందీప్ భార్య జ్యోతి ఆరోపించారు. కొందరు లక్షలు ఖర్చుపెట్టి తన భర్తను బ్యాడ్ చేస్తున్నారు అంటూ వాపోయారు. “ఒకరిని సపోర్ట్ చేయడం కోసం మిగిలిన వాళ్లను తొక్కేయడం తప్పు. సందీప్ ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాడు. బిగ్ బాస్ కి వచ్చాక నెగిటివిటీ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక వీడియో పెట్టగానే నిమిషంలో ఒక వంద కామెంట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్లు ముందే కొంత అమౌంట్ ముట్టజెప్పి వెళ్తున్నారు. బయట ఉన్న వాళ్లు మిగిలిన వాళ్లను టార్గెట్ చేస్తూ ఏం చేసినా ట్రోల్స్ చేస్తున్నారు. తెలియని వాళ్లు ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి అతడిని నెగిటివ్ గానే చూస్తూ ఉంటారు. కొంతమంది కాల్ చేసి వదినా అన్నయ్యను బాడ్ చేస్తున్నారు. మేము సపోర్ట్ గా ఉంటాం అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది కాల్ చేసి వదినా అన్నయ్యని బాడ్ చేస్తున్నారు.. మీరు నాకు కొంత అమౌంట్ ఇవ్వండి.. వాళ్లని నెగిటివ్ చేస్తూ వెయ్యి వీడియోలు చేస్తాను.. అంటూ చెబుతున్నారు.

ఎదుటి వాడిని నెగిటివ్ చేయడానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? మనల్ని మనం పాజిటివ్ గా చూపించుకోవాలి. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక బయట పెద్ద దందా జరుగుతోంది. వాళ్ల వాళ్ల దగ్గర లక్షలు తీసుకుని మిగిలిన వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. థంబ్ నెయిల్స్ కూడా ఇష్టమొచ్చినట్లు పెడుతున్నారు. శవాల మీద చిల్లర వేరుకునే వాళ్లు.. చిల్లరగా థంబ్ నెయిల్స్ పెడుతూ నెగిటివ్ చేస్తున్నారు. సందీప్ కు అడుక్కుంటే ఈ స్థాయి వచ్చిందా? ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వచ్చాడు. సందీప్ కు వంద మంది స్టూడెంట్స్ పైగా ఉన్నారు. ఊళ్లలో పొలం పనులు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చి ఈవెంట్స్ చేసుకుని వెళ్తారు. వ్యూస్ కోసం ఒక మనిషిని నీచంగా మాట్లాడుతున్నారు. ఒకడి కడుపుకొట్టి, తక్కువ చేసి డబ్బు సంపాదించుకుంటే అది తిన్నప్పుడు అరగాలి కదా?” అంటూ జ్యోతి ఎమోషనల్ అయ్యారు. మరి.. సందీప్ భార్య జ్యోతి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet