APలో శరవేగంగా విశాఖ, రాయపూర్ ఎక్స్ ప్రెస్ హైవే పనులు!

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లా పరుగులు పెడుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తూ... ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి విశాఖ, రాయ్ పూర్ హైవే నిర్మాణం.

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లా పరుగులు పెడుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తూ... ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి విశాఖ, రాయ్ పూర్ హైవే నిర్మాణం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. పరిపాలనలో తనదనై మార్క్ చూపిస్తూ.. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. ఇక సంక్షేమం, రాష్ట్రా అభివృద్ధే తన లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారు. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపను చేయడమే కాకుండా..వాటి పనులను వేగంగా సాగడంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అందుకు నిదర్శనమే ప్రకాశం జిల్లాలోనే వెలుగొండ ప్రాజెక్ట్. అలానే ప్రస్తుతం విశాఖపట్నం-రాయపూర్ ఎక్స్ ప్రస్ హైవే నిర్మాణలు శరవేగంగా జరుతున్నాయి.

ఏపీలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనుల్లో విశాఖ పట్నం-రాయ్ పూర్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం ఒకటి. ఇది రాయపూర్, విశాఖ ఎకనామిక్ కారిడార్-15లో భాగంగా జరుగుతుంది. ఆరు వరుసలు, 464 కిలోమీటర్లు  పొడవైన యాక్సెస్-నియంత్రిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే. ఈ హైవే  ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతుంది. ప్రస్తుతం, ఇది దుర్గ్ నుండి ఎన్ హెచ్ -30, ఎన్ హెచ్ -130 సి మధ్య బోరిగుమ వరకు నడుస్తుంది. ఆ తరువాత జాతీయ రహదారి-26 నుండి తూర్పున సునాబేడా వరకు వెళ్తోంది. కొత్త మార్గంలో, ఇది రాయ్‌పూర్ జిల్లాలోని అభన్పూర్ వద్ద ప్రారంభమై ధమ్తారి, కంకేర్, కొండగావ్, కోరాపుట్, సబ్బవరం నగరాలతో రాయ్‌పూర్ ను కలుపుతుంది. తరువాత విశాఖపట్నం పోర్టులో ముగుస్తుంది.

ఇది ప్రస్తుత ప్రయాణ సమయం, దూరాన్ని 13 గంటల నుండి 8-9 గంటలకు, 595 కిమీ (370 మైళ్ళు) నుండి 464 కిలోమీటర్లకు (288 మైళ్ళు) తగ్గిస్తుంది. ఇది భారత్ మాల పరియోజనలో భాగం, ఇది కోల్ కతా నుండి విజయనగరం వద్ద కన్యాకుమారి వరకు నడిచే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ను కలుపుతుంది. జాతీయ రహదారులైన ఎన్హెచ్-30-ఎన్హెచ్-34-ఎన్హెచ్-539-ఎన్హెచ్-44-యమునా ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా ఇది దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించబడుతుంది, తద్వారా రాయ్‌పూర్, విశాఖపట్నంలను నేరుగా ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, జబల్పూర్ వంటి మధ్య, ఉత్తర భారత నగరాలతో కలుపుతుంది. ఇక ఈ విశాఖపట్నం – రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ప్యాకేజీ – 3 ( కోర్లం – కంటకపల్లె ) పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం కోర్లం-కంటకపల్లె వద్ద ఈ హైవే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణం కోసం 2021 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ పూర్తి చేయసింది. ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేయండంతో ఏపీ గుండా వెళ్తున్న విశాఖపట్నం-రాయపూర్ ఎకనామిక్ కారిడార్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ 2014 లో రాయ్‌పూర్ నుండి విశాఖపట్నం వరకు ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించాలని నిర్ణయించింది. ఆ నిర్మాణం పూరైతే.. ప్రయాణ సమయం, దూరం తగ్గనున్నాయి. 13 గంటల ప్రయాణం.. 8 నుంచి 9 గంటలకు తగ్గనుంది. అలానే 595 కిలోమీటర్ల నుంచి 464 కిలోమీటర్లకు తగ్గనుంది. ఈ ఎక్స్ ప్రెస్ హైవే దండకారణ్యం, తూర్పు కనుమల ప్రాంతాల గుండా వెళ్తుంది. ఈ నిర్మాణం పూరైతే..ఈ ప్రాంతాలు పరిశ్రమలు, సామాజిక-ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అలానే ఈ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో ఉపాధి లభిస్తోంది. ఈ ప్రణాళికను 2017 లో భారత ప్రభుత్వం ఆమోదించగా.. 2022 నవంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఎక్స్ ప్రెస్ వే చాలా ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతోంది. ఈ ఎక్స్ప్రెస్ వే 2024 చివరి నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో భూసేకరణ ఆలస్యం జరుగుతోంది. అయితే ఏపీలో మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చొరవతో 2021లోనే భూసేకరణ వేగంగా జరిగింది. దీంతోనే  ఏపీలో గుండా వెళ్తున్న ఈ విశాఖ, రాయపూర్ హైవే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.  ఏపీలో నాలుగు ప్రాకేజ్ లో ఈ నిర్మాణం జరగుతోంది. ప్యాకేజ్-1లో భాగంగా ఆలూరు నుండి జక్కువ (365.033 కి.మీ నుండి 396.800 కి.మీ). ప్యాకేజ్-2 భాగంగా విజయనగరం జిల్లాలోని జక్కువ నుండి కొర్లాం (396.800 కి.మీ నుండి కి.మీ 421.100 కి.మీ) మేర నిర్మాణం జరుతోంది. ప్యాకేజ్-3లో భాగంగా విజయనగరం జిల్లాలోని కొర్లాం నుండి కంఠకపల్లె వరకు ఉంది. ప్యాకేజ్-4లో విశాఖపట్నం జిల్లా కంఠకపల్లె నుండి సబ్బవరం వరకు ఉంటుంది.

ఇలా మొత్తం నాలుగు ప్యాకెజ్ లో ఏపీలో విశాఖపట్నం, రాయపూర్ హైవే నిర్మాణ పనులు జరుగుతోన్నాయి. ఎక్స్ ప్రెస్ వే మార్గంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, వృద్ధికి తోడ్పడే వివిధ వ్యవసాయ, పారిశ్రామిక కార్యక్రమాలు. ఈ కేంద్రాల ఏర్పాటుతో రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్న వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ నిర్మాణాలు రాష్ట్ర అభివృద్ధి పట్ల సీఎం జగన్ కి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. అభివృద్ధి ఎక్కడ అనే వారికి రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి ఎన్నో నిర్మాణానే సాక్ష్యం అని పలువురు చెబుతున్నారు. మొత్తంగా వివిధ అభివృద్ధి పనులను శరవేగంగా జరగడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మరి..విశాఖ-రాయపూర్ హైవే నిర్మాణ పనులు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న  ప్రత్యేక చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments