iDreamPost
android-app
ios-app

జగన్ పట్టుదలకు నిదర్శనం ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌! ఇది జగన్ అంటే!

  • Published Apr 03, 2024 | 9:09 AM Updated Updated Apr 03, 2024 | 9:09 AM

సీఎం జగన్ ఒక్కసారి తాను అనుకున్నారంటే చేసేస్తారు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. అది మరోమారు ప్రూవ్ అయింది. జగన్ డెడికేషన్​కు నిదర్శనం ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

సీఎం జగన్ ఒక్కసారి తాను అనుకున్నారంటే చేసేస్తారు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. అది మరోమారు ప్రూవ్ అయింది. జగన్ డెడికేషన్​కు నిదర్శనం ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

  • Published Apr 03, 2024 | 9:09 AMUpdated Apr 03, 2024 | 9:09 AM
జగన్ పట్టుదలకు నిదర్శనం ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌! ఇది జగన్ అంటే!

ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ది పథంలో దూసుకెళ్తోంది. విద్య, వైద్యంతో పాటు ప్రజలకు ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు సీఎం జగన్. అలాగే ఇతర మౌలిక రంగాల్లోనూ కావాల్సిన మార్పులను శరవేగంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ రంగం మీద స్పెషల్ ఫోకస్ చేసిన ఆయన.. ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ (ఐఆర్‌ఈఎస్‌పీ)ను సీరియస్​గా తీసుకున్నారు. భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎంతో కీలకంగా మారిన ఈ ప్రాజెక్ట్​ను వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల ధనం వెచ్చించి నిర్మిస్తోంది. కర్నూలు జిల్లా, గుమ్మటం తండాలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని జగన్ సర్కారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఫ్యూచర్​లో ఎలాంటి ఇంధన డిమాండ్ వచ్చినా తీర్చాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలోని గుమ్మటం తండాలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్​ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్​ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం దీని కోసం ఏకంగా రూ.30,000 కోట్లను ఖర్చు చేస్తోంది. 5,230 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఐఆర్​ఈఎస్​పీని మే 18, 2022లో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తొలి దశ పనులు ఈ ఏడాది జులై నాటికి పూర్తవనున్నాయి. జగన్ సర్కారు కృషి వల్లే ఏపీలో పరిశ్రమలు పెరిగాయి. అదే టైమ్​లో ఆర్థికాభివృద్ధి, వినియోగదారుల వృద్ధి, పట్టణీకరణ కారణంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ అంతరాయాలు లేని నిరంతరాయ, నాణ్యమైన కరెంట్​ను తక్కువ ధరలకు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఐఆర్​ఈఎస్​ ప్రాజెక్ట్​కు పునాదులు వేసింది.

గ్రీన్​కో సంస్థతో కలసి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్​ను డెవలప్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. జల, పవన, సౌర విద్యుత్​ను ఒకే చోట ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ. జల, సౌర, పవన విద్యుత్​ను వినియోగించి నీళ్లను ఎగువ జలాశయంలోకి పంపుతారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న టైమ్​లో ఆ నీళ్లను దిగువకు వదిలి కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 23,000 మందికి ఉపాధి లభించనుంది. అభివృద్ధి పనులను పరిగెత్తిస్తున్న జగన్ ప్రభుత్వం.. ఐఆర్​ఈఎస్​పీని కూడా సీరియస్​గా తీసుకుంది. కోట్లు ఖర్చు చేస్తూ ప్రాజెక్ట్​ను త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ వర్క్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. దీంతో వైసీపీ సర్కార్​ను, ముఖ్యమంత్రి జగన్ డెడికేషన్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. మరి.. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్​ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషి మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.