iDreamPost
android-app
ios-app

సముద్రంతో పోటీ పడుతూ..YSRCP సిద్ధం సభకు పోటెత్తిన జనం!

YSRCP Siddam: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ఇప్పటికీ భీమలీ, ఏలూరులో నిర్వహించిన సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తాజాగా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో సముద్రంతో పోటీ పడుతూ జనం పోటెత్తారు.

YSRCP Siddam: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ఇప్పటికీ భీమలీ, ఏలూరులో నిర్వహించిన సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తాజాగా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో సముద్రంతో పోటీ పడుతూ జనం పోటెత్తారు.

సముద్రంతో పోటీ పడుతూ..YSRCP సిద్ధం సభకు పోటెత్తిన జనం!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడింది. మరికొద్ది నెల్లలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేనాల ఊహలకు కూడా అందని రీతిలో సీఎ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ.. ఎన్నికల సమరంలోకి దిగారు. ఇప్పటికే భీమిలీ, దెందులూరులో జరిగిన సిద్ధం సభలో గ్రాండ్  సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆదివారం రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభ జనసంద్రంగా మారింది.

2024లో జరిగే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా సీఎం వైఎస్ జగన్  శంఖం పూరించి..ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈక్రమంలోనే ఆదివారం రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభ జనసంద్రంగా మారింది. ఈ సభకు సీమలోని పలు ప్రాంతాల నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలతో సిద్ధం సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. అయినప్పటికీ ఇంకా లక్షలాదిగా  జనం వైఎస్సార్ సీపీ సిద్ధం సభకు తరలిస్తున్నారు.

సభ ప్రాంగణం జనాలతో నిండిపోయి.. రోడ్లపైన కూడా భారీగా నిల్చుకున్నారు. ఇది రాయలసీమ చరిత్రలోనే భారీ బహిరంగ సభ ఇదని ప్రజలు అభిప్రాయా పడుతున్నారు. ఇక  సముద్రంతో పోటీ పడుతూ రాప్తాడు సిద్ధం సభకు జనం పోటెత్తిన్నారు. ఇక  సభ విషయానికి వస్తే..250 ఎకరాలకు పైగా ఉన్న సువిశాల మైదానంలో ఈ  సభకు ఏర్పాట్లు చేశారు. భీమిలి, దెందులూరులో నిర్వహించిన సభలకు జనం సంద్రం పోటెత్తడం..జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి. దీంతో రాప్తాడు సభ విషయంలో కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కాయి. సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్..వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ర్యాంప్ పై  నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేశారు.

ఇక ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసగించారు. మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ.. సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలని అన్నారు. వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని, మహిళా సాధికారతకు పెద్ద పీటవేసిన ప్రభుత్వం మనదని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యమని ఉషా శ్రీచరణ్ తెలిపారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో సిద్ధం కార్యక్రమం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ట్విట్టర్ లో దేశంలోనే సిద్ధం హ్యాహ్ ట్యాగ్ మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. వైఎస్సార్ సీపీ అభిమానులు సిద్ధం సభకు సంబంధించిన అప్ డేట్స్ ను భారీగా షేర్ చేస్తోన్నారు. సిద్ధం సభా ప్రాంగణం ఫోటోలతో ఫేస్ బుక్ , ట్విట్టర్ ఖాతాలు నిండిపోయాయి.