ఆదర్శంగా నిలిచిన సర్పచ్..ఏకంగా సొంత నిధులతో!

ఆదర్శంగా నిలిచిన సర్పచ్..ఏకంగా సొంత నిధులతో!

నేటికాలంలో పదవిలో ఉండగా దొరికిన కాడికి దోచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు ప్రజాప్రతినిధులు. మరికొందరు మాత్రం చాలా స్పెషల్ గా ఉంటారు. ప్రజల కోసం సొంత డబ్బులనే ఖర్చు చేస్తుంటారు.

నేటికాలంలో పదవిలో ఉండగా దొరికిన కాడికి దోచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు ప్రజాప్రతినిధులు. మరికొందరు మాత్రం చాలా స్పెషల్ గా ఉంటారు. ప్రజల కోసం సొంత డబ్బులనే ఖర్చు చేస్తుంటారు.

నేటికాలంలో ప్రజాప్రతినిధులు, రాజకీయలపై ప్రజలకు ఓ రకమైన అభిప్రాయం ఉంది. వీళ్లు అక్రమసంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తారని, ప్రజలకు సేవ చేసేందుకు కాదనే ఆలోచనలో చాలా మంది జనాలు ఉంటారు. వారి ఆలోచనకు తగినట్లే చాలా మంది ప్రజాప్రతినిధులు రాజకీయాన్ని సంపాదనకు మార్గంగానే భావిస్తున్నారు. పదవిలో ఉండగా అవకాశం దొరికిన వరకు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మాత్రం చాలా స్పెషల్ గా ఉంటారు. దోచుకుని, దాచుకుందామనుకునే నాయకులకు వీళ్లు పూర్తి వ్యతిరేకంగా.. తమ చేతిలోని డబ్బులను సైతం ప్రజల కోసం ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారే చరిత్రలో నిలిచి పోతుంటారు. ఆ కోవలకు చెందిన వారే.. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ సర్పంచ్.

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని వైబీ అగ్రహారం గ్రామ పంచాయతీకి దశాబ్దాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు అనేది ఈ పంచాయతీలో  కనిపించదు. ఇక ఈ పంచాయతీ  ఏర్పడిన నాటి నుంచి ఇది టీడీపీ కంచుకోటగా ఉంది. ఇక్కడి  ఏళ్ల తరబడి టీడీపీ వ్యక్తే సర్పంచ్ గా ఉన్నారు. అంత స్థాయిలో టీడీపీకి పట్టు ఉన్న  ఈపంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది.  నర్సీపట్నం ఎమ్మెల్యే  ఉమాశంకర్ గణేష్ ఆశీస్సులతో కోసూరి విజయ సర్పంచ్ గా ఈసారి గెలిచారు. ఏళ్ల తరబడి టీడీపీకి అనుకూలంగా ఉన్న పంచాయతీ.. తనపై నమ్మకం ఉంచి ఆ పార్టీని కాదని తనను గెలిపించంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోయే మంచి పని చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఆ గ్రామ ప్రజలకు ప్రధాన సమస్య అయినా రహదారి గురించి ఆమె ఆలోచించారు.

వైబీ అగ్రహాం నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న ఊరగెడ్డపై బ్రిడ్జిని నిర్మిస్తే.. దూరం 5 కి.మీ తగ్గనుంది. దీంతో ఈ వంతెన నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టారు. సర్పంచ్ విజయ.. తన సొంత నిధులు రూ.3.40 లక్షలు ఖర్చుచేసి.. వంతెనను, దానితో పాటు అనుసంధాన రోడ్డును నిర్మించారు. ఇక వీరు చేసిన ఈ మంచి కార్యంతో ప్రజలందరికి ఎంతో మేలు చేకూరింది.

ఈ ప్రాంతంలో సుమారుగా 500 ఎకరాల్లో పండించే  వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు మార్గం సుగమం అయింది.  ఇప్పుడు కేవలం 1.5 కి.మీ ప్రయాణిస్తే..  గమ్యస్థానానికి వస్తువులను చేరవేయోచ్చు.  అలానే నాయుడుపాలెం, మన్యపురట్ల, లింగం పేట  గ్రామాలకు, మండల కేంద్రం నాతవరానికి దగ్గర దారి ఏర్పడింది. ఊరగెడ్డపై వంతెన నిర్మాణం జరగడంతో వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు మార్గం  ఏర్పడింది. అంతేకాక రవాణ సౌకర్యం పెరగడంతో ఇక్కడి భూములకు  ధరలు పెరిగాయి. ఇంత మంచి కార్యం చేసిన సర్పంచ్ ఎలాంటి  ఆర్భాటాలకు తావులేకుండా వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలతోనే ప్రారంభించారు.

ఈ విషయంపై సర్పంచ్ విజయ మీడియాతో మాట్లాడారు. తనకు ఎలాంటి ప్రచారం వద్దని, గ్రామ ప్రజల హృదయాల్లో తాము చేసిన మంచి నిలిచిపోతే చాలని ఆమె తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం జగన్ కి, పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఉమా శంకర్  గణేష్ కు సర్పంచ్ విజయ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజలతో పాటు..చుట్టు పక్కల పంచాయాతీల వారు కూడా సర్పంచ్ విజయపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. మరి.. సర్పంచ్ విజయపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments