మహిళకు కార్యదర్శి వేధింపులు.. వీడియో కాల్‌లో నగ్నంగా కనపడాలంటూ..

డెత్ సర్టిఫికెట్ కావాలన్నందుకు మహిళను వేధించిన పంచాయతీ సెక్రెటరీ. వీడియో కాల్ లో నగ్నంగా కనపడాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

డెత్ సర్టిఫికెట్ కావాలన్నందుకు మహిళను వేధించిన పంచాయతీ సెక్రెటరీ. వీడియో కాల్ లో నగ్నంగా కనపడాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. లంచాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చేతులు తడపనిదే ఏ పని జరగని పరిస్థితి దాపరించింది. సర్టిఫికెట్స్ కావాలన్నా.. ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం పొందాలన్నా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి. మరికొంతమంది అధికారులు మాత్రం సాయం కోరి వచ్చిన మహిళలను లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్నారు. శారీరక సుఖాలను తీరుస్తే మీ పనులు క్షణాల్లో పూర్తవుతాయని వేధింపులకు గురిచేస్తున్నారు. ఇదే తరహాలో ఓ గిరిజన మహిళను పంచాయతీ సెక్రటరీ వేధించాడు. తన తండ్రి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని అడిగితే తనతో గడపాలని కార్యదర్శి వేధించాడు. రాత్రికి వస్తే డెత్ సర్టిఫికెట్ గంటలో ఇస్తానంటూ వేధింపులకు గురిచేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లురు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నెల్లూరులో అధికారి లీలలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాపూరు పంచాయితీలోని కోడూరుపాడుకు చెందిన ఓ గిరిజన మహిళ తన తండ్రి చనిపోవడంతో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ చెంచయ్యను కోరింది. మూడు సంవత్సరాలుగా డెత్ సర్టిఫికెట్ కోసం తీరుగుతున్నది. ఇదే అదునుగా భావించిన చెంచయ్య ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. మహిళను టార్చర్ చేయడం ప్రారంభించాడు. వీడియో కాల్ లో నగ్నంగా కనపడాలని ఫోన్ కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. తాను పిలిచినప్పుడు రాత్రి రూమ్ కు వస్తే.. సర్టిఫికెట్ ఇస్తానని కార్యదర్శి మహిళను కోరాడు. రాత్రికి వస్తే.. గంటలో సర్టిఫికెట్ ఇస్తానంటూ వేధించాడు. దీనికి ఆ గిరిజన మహిళ నిరాకరించింది. ఈ క్రమంలో వేధింపులు తాళలేక చెంచయ్యపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కంప్లైంట్ అందుకున్న పోలీసులు కార్యదర్శి చెంచయ్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే కోడూరుపాడుకు చెందిన గిరిజన మహిళ తండ్రి కొంత కాలం క్రితం చనిపోయాడు. కాగా ఈయన పేరుమీద ఉన్న భూమి ముంపుకు గురైంది. ప్రభుత్వం నుంచి ముంపుకు సంబంధించిన పరిహారం అందాల్సి ఉంది. దాదాపు 10 లక్షలు పరిహారం రావాల్సి ఉంది. అయితే ఈ పరిహారం అందాలంటే డెత్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం గిరిజన మహిళ మూడేళ్లుగా అధికారి చుట్టూ తిరుగుతున్నది.

ఆమెపై కన్నేసిన కార్యదర్శి వేధింపులకు గురిచేశాడు. రూమ్ కు వచ్చి తనతో గడపాలని ఫోన్ లో వేధించాడు. కార్యాదర్శి ఆగడాలు ఎక్కువవుతుండడంతో ఆ మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి గిరిజను మహిళను నిజంగానే వేధించాడా? లేదా కావాలనే బురదజల్లుతున్నదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరి డెత్ సర్టిఫికెట్ కావాలంటే రాత్రికి రమ్మన్న కార్యదర్శిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments