iDreamPost
android-app
ios-app

మత్తులో తల్లి.. ఆ బిడ్డ పడ్డ బాధకు కన్నీళ్లు రాక మానవు!

  • Published Aug 20, 2023 | 12:46 PM Updated Updated Dec 09, 2023 | 1:22 PM

ప్రాణాలకు తెగించైనా బిడ్డను రక్షించుకోవాలనుకుంటుంది. తనకు తిండి లేకపోయినా బిడ్డల కడుపు నింపాలని చూస్తుంది. అయితే, కొంతమంది మాత్రం తల్లి అన్న పదానికే మచ్చ తెస్తున్నారు. తమ సంతోషం కోసం బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారు.

ప్రాణాలకు తెగించైనా బిడ్డను రక్షించుకోవాలనుకుంటుంది. తనకు తిండి లేకపోయినా బిడ్డల కడుపు నింపాలని చూస్తుంది. అయితే, కొంతమంది మాత్రం తల్లి అన్న పదానికే మచ్చ తెస్తున్నారు. తమ సంతోషం కోసం బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారు.

  • Published Aug 20, 2023 | 12:46 PMUpdated Dec 09, 2023 | 1:22 PM
మత్తులో తల్లి.. ఆ బిడ్డ పడ్డ బాధకు కన్నీళ్లు రాక మానవు!

ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరన్నది జగమెరిగిన సత్యం. బిడ్డకు కష్టం వస్తే తల్లి విలవిల్లాడిపోతుంది. ప్రాణాలకు తెగించైనా బిడ్డను రక్షించుకోవాలనుకుంటుంది. తనకు తిండి లేకపోయినా బిడ్డల కడుపు నింపాలని చూస్తుంది. అయితే, కొంతమంది మాత్రం తల్లి అన్న పదానికే మచ్చ తెస్తున్నారు. తమ సంతోషం కోసం బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా, ఓ తల్లి మత్తులో పడి బిడ్డను పట్టించుకోలేదు. ఈ ప్రపంచంతో సంబంధం లేని దానిలా మత్తులో జోగసాగింది.

శనివారం చిత్తూరులోని ఓ ప్రాంతంలో ఓ మహిళ తన బిడ్డతో కలిసి రోడ్డు పక్కన ఉంది. ఆ మహిళ మత్తులో జోగుతూ ఉంది. ఆమె బిడ్డ మాత్రం తల్లిని పిలుస్తూ.. ఆమె అటు, ఇటు తూలుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడు. అతడు తల్లి తల పట్టుకుని పైకి లేపుతూ ఉంటే.. ఆమె కిందపడిపోతూ ఉంది. అది చూసిన అక్కడి వారు ఆమెకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆమె నీళ్లు తాగలేదు సరికాదా.. నీళ్లు ఇచ్చిన వారిపై మండిపడింది. దీంతో అక్కడి వారు మహిళా పోలీసు శశికి సమాచారం ఇచ్చారు.

అందిన సమాచారంతో అక్కడకు చేరుకున్న శశి.. మహిళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయినప్పటికి ఆ మహిళ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక, ఇలా అయితే, లాభం లేదనుకున్న శశి మహిళ ముఖంపై నీళ్లు చల్లింది. దీంతో మహిళ కొద్దిగా స్ప్రహలోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫొటో మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూస్తున్న నెటిజన్లు ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio