TDP నేతలకి లోకేశ్ పై నమ్మకం లేదా? తారక్ కోసం ఆరాటం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్ట్‌ కావటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ శ్రేణులు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. టీడీపీ ముఖ్య నేతలు ప్రభుత్వంపై విమర్శలు సైతం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు బీజీపీ నేతలు అరెస్ట్‌పై స్పందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్పందించని జూ.ఎన్టీఆర్‌.. తారక్‌ కోసం టీడీపీ నేతల ఆరాటం!

చంద్రబాబు అరెస్టయి ఈ రోజుతో మూడు రోజులు అవుతోంది. మూడు రోజులు అవుతున్నా జూనియర్‌ ఎన్టీఆర్‌నుంచి ఎలాంటి స్పందన రాలేదు. టీడీపీ అధినేత అన్న సంగతి పక్కన పెడితే.. సొంత మేనత్త భర్త అరెస్ట్ అయితే స్పందించకపోవటం ఏంటి? ఆ మౌనం ఎందుకు? అంటూ టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. టీడీపీ కీలక నేతలతో పాటు మిగిలిన కార్యకర్తలు కూడా తారక్‌ స్పందన కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేసినా చాలు అనుకుంటున్నారు.

TDP నేతలకి లోకేశ్ పై నమ్మకం లేదా? 

టీడీపీలోని కీలక నేతలు అందరూ జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన స్పందించకపోవటం వారికి మింగుడుపడటం లేదు. అందుకే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చంద్రబాబు తర్వాత లోకేశ్‌ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి లోకేశ్‌ గురించి ఆలోచించకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి పార్టీ నేతలు ఆలోచించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారు లోకేశ్‌ నాయకత్వాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదన్న చర్చ జరుగుతోంది. ఒకరకంగా వారికి లోకేశ్‌ నాయకత్వంపై నమ్మకం లేదన్న టాక్‌ కూడా నడుస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందిస్తేనే కొంత ప్రభావం ఉంటుందని, ప్రజల్లోకి పాజిటివ్‌గా వెళ్లవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ కష్టాల్లో ఉన్న ఈ సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నాయకత్వం అయితే బాగుంటుందని వారు భావిస్తున్నట్లు వినికిడి.

Show comments