ఇటీవల కొన్ని రోజులు ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వరదల ప్రభావం బాగా కనిపించింది. ఇలానే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇక గతకొన్ని రోజుల నుంచి ఈ వానాలు బ్రేక్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఎండలు కూడా విజృంభిస్తున్నాయి. ఇలా ఒకవైపు భారీ వానలతో, మరో వైపు ఎండల తీవ్రతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ వాతావరణ శాఖ..కొన్ని కీలక విషయాలను తెలిపింది. రాబోయే మూడు రోజులు ఏపీలో పలు చోట్ల తేలిక పాటి వానలు, రోజు ఉండే ఉష్టోగ్రతల కంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతుందని తెలిపింది.
ఏపీ,యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణము భాగంలో బలమైన పడమటి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు, అదే విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈరోజు ,రేపు మరియు ఎల్లుండి.. ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలానే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 3 నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికముగా నమోదయ్యే అవకాశముంది. వేడి తేమ, అసౌకర్య వాతావరణము పలు ప్రాంతాల్లో ఏర్పడే అవకాశము ఉంది.
బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీసే అవకాశముంది. ఇక దక్షిణి కోస్తా విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఈరోజు ,రేపు మరియు ఎల్లుండి.. తేలిక పాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. సాధారణం కంటె 3 నుండి 5డిగ్రీల సెంటీగ్రేడ్ అధికముగా నమోదయ్యే అవకాశముంది. వేడి తేమ ఏర్పడే అవకాశము ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీసే అవకాశముంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 5డిగ్రీల సెంటీగ్రేడ్ అధికముగా నమోదవుతాయి. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.