nagidream
Harsha Sai About Telegram In Past: ప్రస్తుతం టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రెంచ్ పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. నేరాలకు అడ్డాగా టెలిగ్రామ్ మారిందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టెలిగ్రామ్ ని భారత్ లో బ్యాన్ చేసేందుకు భారత ప్రభుత్వం చూస్తుందని సమాచారం. అదే జరిగితే కనుక యూట్యూబర్ హర్ష సాయి కల నెరవేరినట్టే. ఎలా అంటే?
Harsha Sai About Telegram In Past: ప్రస్తుతం టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రెంచ్ పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. నేరాలకు అడ్డాగా టెలిగ్రామ్ మారిందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టెలిగ్రామ్ ని భారత్ లో బ్యాన్ చేసేందుకు భారత ప్రభుత్వం చూస్తుందని సమాచారం. అదే జరిగితే కనుక యూట్యూబర్ హర్ష సాయి కల నెరవేరినట్టే. ఎలా అంటే?
nagidream
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ భారతదేశంలో బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దోపిడీ, గ్యాంబ్లింగ్ వంటి నేరపూరిత కార్యకలాపాలకు టెలిగ్రామ్ ద్వారా సులభతరం అవ్వడం.. వాటికి అడ్డుకట్ట వేయడంలో విఫలమైన కారణంగా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ని ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్ ప్లాట్ ఫార్మ్ మీద దర్యాప్తు ప్రారంభించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి టెలిగ్రామ్ ని భారత్ లో నిషేధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎక్స్ టార్షన్, గ్యాంబ్లింగ్ వంటి నేరాలకు అడ్డాగా టెలిగ్రామ్ ఉందని వస్తున్న ఆరోపణలు నిజమైతే కనుక దేశంలో టెలిగ్రామ్ ని నిషేధిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
అయితే పావెల్ అరెస్ట్ కారణంగా టెలిగ్రామ్ లో దారుణాలు వెలుగు చూశాయి. అయితే ఈ అరెస్ట్ కంటే ముందే టెలిగ్రామ్ లో నేరాలు జరుగుతున్నాయని యూట్యూబర్ హర్ష సాయి ఎప్పుడో చెప్పారు. టెలిగ్రామ్ ని బేస్ చేసుకుని ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా నడుస్తుందని.. లక్షల మందిని పెట్టుబడి పెట్టించి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని గతంలో హర్ష సాయి ఆరోపించారు. ఇలాంటి వాటిని కదా దేశంలో బ్యాన్ చేయాలి అని అప్పుడే చెప్పారు. తాను లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ మాత్రమే చేస్తున్నానని.. కానీ ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా కొంతమంది అమాయకులతో పెట్టుబడి పెట్టించి వాళ్ళని రోడ్డు మీదకు లాగుతున్నారని హర్ష సాయి ఆరోపించారు. ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలని.. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయాలని అన్నారు.
అయితే హర్ష సాయి చెప్పినట్లు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ముఠానే కాదు.. ఇందులో చాలా రకాల నేరాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. టెలిగ్రామ్ లో ఇల్లీగల్ బెట్టింగ్ ఒకటే కాకుండా.. సినిమా పైరసీ, పో*ర్న్ వీడియోలు, ఫేక్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ఇలా చాలా రకాల ఫ్రాడ్స్, నేరాలు జరుగుతున్నాయి. హర్ష సాయి చెప్పిన దాని కంటే ఎక్కువే దారుణాలు, నేరాలు ఈ టెలిగ్రామ్ ని బేస్ చేసుకుని నడుస్తున్నాయి. నేరాలకు పాల్పడేవారికి టెలిగ్రామ్ ఒక అడ్డాగా మారిపోయింది. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్లే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ ని ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. పావెల్ అరెస్ట్ తో ఇప్పుడు భారత్ లో టెలిగ్రామ్ ని నిషేధించే పనిలో పడింది భారత ప్రభుత్వం. అదే జరిగితే కనుక హర్ష సాయి అనుకున్నది జరిగినట్టే. టెలిగ్రామ్ లో ఇక నుంచి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా నడవదు. దీని వల్ల ఎంతోమంది అమాయక జీవితాలు సేఫ్ గా ఉంటాయి.