iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: TDP MLA చినరాజప్ప కారుకు ప్రమాదం

  • Published Feb 24, 2024 | 9:46 PM Updated Updated Feb 24, 2024 | 9:47 PM

ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురు నాయకులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కారుకు ప్రమాదం చోటుచేసుకుంది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురు నాయకులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కారుకు ప్రమాదం చోటుచేసుకుంది.

  • Published Feb 24, 2024 | 9:46 PMUpdated Feb 24, 2024 | 9:47 PM
బ్రేకింగ్: TDP MLA చినరాజప్ప కారుకు ప్రమాదం

ఇటీవలికాలంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. అజాగ్రత్త, నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. నిన్న (శుక్రవారం) పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం భారిన పడ్డారు. టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో చోటుచేసుకుంది.

కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో పెద్దాపురం నియోజకవర్గానికి తెదేపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చినరాజప్పను చంద్రబాబు ప్రకటించారు. చినరాజప్పకు మూడో సారి టికెట్ దక్కడంతో పార్టీశ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. ర్యాలీ తీస్తున్న సమయంలో చిన రాజప్ప ప్రయాణిస్తున్న కారుకు ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో చినరాజప్ప కారులోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు కారును డివైడర్‌ పైనుంచి కిందకు దించారు. ఈ ప్రమాదంలో చినరాజప్పకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet