Arjun Suravaram
ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలు తీర్చే వారు. అలానే సమాజాభివృద్ధిలో వారి బాధ్యత చాలా కీలకమైనది. అయితే కొందరు మాత్రం పదవిలో ఉన్నామనే ఆహంకారంతో శృతి మించి ప్రవర్తిస్తుంటారు.
ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలు తీర్చే వారు. అలానే సమాజాభివృద్ధిలో వారి బాధ్యత చాలా కీలకమైనది. అయితే కొందరు మాత్రం పదవిలో ఉన్నామనే ఆహంకారంతో శృతి మించి ప్రవర్తిస్తుంటారు.
Arjun Suravaram
ప్రజాప్రతినిధులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడి, వారి సమస్యలు తీర్చే వారు. అందుకే సమాజంలో వారి బాధ్యత చాలా కీలకమైనది. అయితే కొందరు మాత్రం పదవిలో ఉన్నామనే ఆహంకారంతో శృతి మించి ప్రవర్తిస్తుంటారు. మరికొందరు అయితే ప్రజల కోసం చర్చించే ప్రజాసభలో రచ్చ రచ్చ చేసి..గందరగోళం సృష్టిస్తుంటారు. ఇలాంటివి ఏపీలో కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీకి చెందిన నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓ మున్సిపల్ మీటింగ్ లో టీడీపీకి చెందిన కౌన్సిలర్ వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం..పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శనివారం పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఇక ఈ సమావేశంలో ప్రజల ఇబ్బందుల గురించి చర్చించాల్సింది పోయి టీడీపీకి చెందిన కౌన్సిలర్ కోరాడ నారాయణ రావు వీరంగం సృష్టించాడు. ప్రశాంతంగా జరుగుతున్న పార్వతీపురం ఈ కౌన్సిల్ సమావేశాన్ని రచ్చచేయాలన్న దురుద్దేశంతో గొడవకు దిగాడని ఇతర నేతలు చెబుతున్నారు. అధికారపక్ష వైసీపీకి చెందిన కౌన్సిలర్, దళితుడైన నిమ్మకాయల సుధీర్‌ను కులంపేరుతో నారాయణ రావు దూషించాడు. అంతేకాక ఆయనపై దాడికి పాల్పడినట్లు ఇతర కౌన్సిలర్ తెలిపారు. ఇక ఈ గొడవతో శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది.
ఈ మీటింగ్ లో టీడీపీ కౌన్సిలర్లు సభా దృష్టికి తెచ్చిన సమస్యలకు అధికార పక్షానికి చెందిన సభ్యులు నిదానంగా వివరణలు ఇస్తున్నారు. ఈ దశలో టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు సహనం కోల్పోయాడు. తమకు అధికారంలేదన్న ఓ దురుద్దేశంతో ఉగ్రరూపం దాల్చాడు. అధికార పక్ష సభ్యులపై ఇష్టానుసారంగా తిట్టడం ప్రారంభించాడు. సభా మర్యాదలను ఉల్లంఘిస్తూ దూషించాడు. ఈ ఘటనపై దళిత కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణరావుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. అదే విధంగా టీడీపీ కౌన్సిలర్ ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారణ చేస్తున్నామన్నారు.
ఇక సమావేశంలో జరిగిన ఘటనపై దళిత సంఘాలు స్పందించాయి. దళితులను కులంపేరుతో కించపరిచిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెల్లి కులసంఘం సభ్యులు సొండి గోపి డిమాండ్ చేశారు. టీడీపీ కౌన్సిలర్, నాయకుల తీరుకు నిరసనగా పార్వతీపురం టౌన్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ..గతంలో టీడీపీ నేత చంద్రబాబునాయుడు ‘దళితులుగా పుట్టాలి అని ఎవరు కోరుకుంటారని’ కించపరిచారని, తాజాగా అదే తోవలో ఆ పార్టీ నాయకులు నడుస్తున్నారని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రెల్లికుల సభ్యులు గండి లక్ష్మి, సొండి శంకరరావు, న్యాయవాది చైతన్య, పాలకొండ రాజశేఖరు, కోలా రాజు, నిమ్మకాయల సుందరరావు, దేవుపల్లి సోకు, దాసు తదితరులు పాల్గొన్నారు. మరి.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ రచ్చ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.