iDreamPost
android-app
ios-app

Srikakulam YSRCP Candidates List: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

  • Published Mar 16, 2024 | 2:24 PM Updated Updated Mar 16, 2024 | 3:40 PM

Srikakulam District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎవరికి ఏ సీట్లు కేటాయించారో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 16, 2024 | 2:24 PMUpdated Mar 16, 2024 | 3:40 PM
Srikakulam YSRCP Candidates List: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్‌ రావు, అలాగే నందిగామ సురేష్‌ పేర్లను చదివి ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

మొత్తం స్థానాల్లో 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీలకు ఒక ఎంపీ సీట్లు కేటాయించారు. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. అయితే.. శ్రీకాకుళం జిల్లా పరంగా చూసుకుంటే.. ఈ జిల్లాలో మొత్తం 8 నియోజకర్గాలు ఉన్నాయి.  మరి ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

శ్రీకాకుళం

  • ఇచ్ఛాపురం పిరియా విజయ – బీసీ(సూర్య బలిజ)
  • పలాససీదిరి అప్పలరాజు – బీసీ(జాలరీ)
  • టెక్కలిదువ్వాడ శ్రీనివాస్ – బీసీ(కళింగా)
  • పాతపట్నంరెడ్డి శాంతి – బీసీ(టీ.కాపు)
  • శ్రీకాకుళంధర్మాన ప్రసాద రావు – బీసీ(పీ.వెలమ)
  • ఆమదాలవలసతమ్మినేని సీతారాం – బీసీ(కళింగా)
  • ఎచ్చెర్ల –  గొర్లె కిరణ్ కుమార్ – బీసీ(టీ.కాపు)
  • నరసన్నపేట –  ధర్మాన కృష్ణ దాస్ – బీసీ(పీ.వెలమ)