ప్రముఖ విద్యావేత్త, శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన స్వగృహంలో బాత్ రూమ్ లో కాలుజారి పడ్డారు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న బీఎస్ రావు గురువారం తుదిశ్వాస విడిచారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు విజయవాడకు తరలిస్తున్నారు. రేపు(శుక్రవారం) విజయవాడంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ బీఎస్ రావు మరణించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో బాత్ రూమ్ లో కాలుజారి పడటంతో.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు బీఎస్ రావు. కాగా.. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలకు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి.