nagidream
Boat Owners Demands More Money From Flood Victims: విజయవాడని వరదలు ముంచెత్తడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తమ ఇళ్ళు నీట మునిగిపోవడంతో నిరాశ్రయులయ్యారు. దీంతో వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు బోటు యజమానులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.
Boat Owners Demands More Money From Flood Victims: విజయవాడని వరదలు ముంచెత్తడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తమ ఇళ్ళు నీట మునిగిపోవడంతో నిరాశ్రయులయ్యారు. దీంతో వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు బోటు యజమానులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.
nagidream
మానవత్వం అనేది ఒకటి ఉంటుంది.. అది ఉండాలి మనుషులకి. అప్పుడే కదా మనుషులు అని అనిపించుకునేది, పిలిపించుకునేది. కొంతమంది దరిద్రంలో కూడా మాకేటి అని బెనిఫిట్స్ చూసుకుంటారు. మొన్నా మధ్య కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగింది ఇదే. ఒక పక్క వయనాడ్ జిల్లా వాసులు వరదల కారణంగా ఇళ్ళు కోల్పోయి దిక్కులేని వారిగా మిగిలిపోయారు. రోడ్డున పడ్డవారిని ఆదుకోకపోగా.. ఎలా ఉన్నారు అని అడగకపోగా.. ఈఎంఐ డబ్బులు ఎప్పుడు కడతారు అంటూ ఫైనాన్స్ కంపెనీల వారు జనాలను వేధించిన సందర్భాలను చూసాం. ఇంతటి దరిద్రంలో కూడా శవాల మీద పేలాలు ఏరుకునేలా ఉన్నారు కదరా అని విమర్శలపాలయ్యారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుంది.
ఒకపక్క విజయవాడ వాసులు భారీ వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరద బీభత్సానికి విజయవాడలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గడిచిన ఇన్నేళ్ళలో ఏరోజూ ఇలాంటి పరిస్థితి లేదు. అంతలా విజయవాడ నీట మునిగింది. చాలా చోట్ల ఇళ్ళు నీట మునగడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు కూడా బాధితులకు సహాయం అందజేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమవ్వడంతో జనాలు ఇళ్ల లోంచి బయటకు రాలేని పరిస్థితి. మనిషిలో సగం లోతు వరకూ నీరు చేరడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పడవల ద్వారా బాధితులకు ఆహారం అందజేస్తున్నారు.
అయితే ఇంత దయనీయ పరిస్థితుల్లో కూడా కొందరు ప్రైవేట్ బోటు యజమానులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉచితంగా సేవ చేయడానికి వస్తుంటారు. అందరికీ అంత స్థోమత ఉండదు కాబట్టి కొంత డబ్బులు అయితే తీసుకుంటారు. కానీ విజయవాడలోని కొందరు ప్రైవేటు బోటు యజమానులు మాత్రం.. ఇదే అవకాశం మళ్ళీ రాదు అనేలా ప్రవర్తిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏకంగా రూ. 1500 నుంచి రూ. 4 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆపద సమయంలో ఇంత దారుణంగా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు బోట్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద బాధితులతో ప్రైవేటు బోటు యజమానులు చట్ట విరుద్ధమైన వ్యాపారం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కాగా భారీ వరదల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మరింత విస్తృతం చేసేందుకు పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో విజయవాడకు చేరాయి. నేవీ బృందాలు హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి విజయవాడ బాధితులకు సహాయం చేస్తుంటే.. అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తులు ఇలా డబ్బులు డిమాండ్ చేయడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మరి వరదల్లో చిక్కుకున్న విజయవాడ బాధితులతో కొందరు ప్రైవేట్ బోట్ల యజమానులు వ్యాపారం చేస్తున్నారంటూ జనం మండిపడుతుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.