డేంజర్ లో విజయవాడ.. వరదలు ఆగాకే అసలు సమస్య!

Vijayawada: ఏపీలోని విజయవాడలో ప్రస్తుతం వరుణుడు శాంతించడంతో.. ప్రజలందరికీ కాస్త ఊరట లభించింది. కానీ, ఇక నుంచే అసలు సమస్య మొదలవ్వబోతుందని, త్వరలోనే విజయవాడ డేంజర్ లో పడబోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ విజయవాడకు రాబోతున్న ఆ డేంజర్ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Vijayawada: ఏపీలోని విజయవాడలో ప్రస్తుతం వరుణుడు శాంతించడంతో.. ప్రజలందరికీ కాస్త ఊరట లభించింది. కానీ, ఇక నుంచే అసలు సమస్య మొదలవ్వబోతుందని, త్వరలోనే విజయవాడ డేంజర్ లో పడబోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ విజయవాడకు రాబోతున్న ఆ డేంజర్ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో అల్లడించింది. ముఖ్యంగా ఏపిలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో అయితే ఎన్నడు లేని విధంగా భారీ వరదలతో ప్రళయం సృష్టించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ అయిన విధంగా భారీ వర్షాలు కురవడంతో.. వాగులు, నదులు, చెరువులు పొంగిపోయి రహదారులను ధ్వంసం చేశాయి. అలాగే కొన్ని చోట్ల చెట్లు, కొండచరియాలు విరిగిపడటంతో చాలామంది ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. అయితే ఈ వర్ష ప్రభావం నేడు కూడా రాష్ట్రంలో కొనసాగే పరిస్థితి ఉందని వాతవరణ శాఖ హెచ్చరించారు.

దీంతో ఏపీలోని విద్య సంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఏపీలోని వరుణుడు శాంతించడంతో.. ప్రజలందరికీ కాస్త ఊరట లభించింది. అలాగే ఈ భారీ వర్షాల ధాటికి అతాలకుతలమైన ప్రాంతలపై ప్రభుత్వం దృష్టి సారించి సహయక చర్యలు చేపడుతుంది. అలాగే నగర, పల్లె  ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా వాటిల్లడంతో అధికారులు ఆ సమాచారాలను సేకరించి వరద బాధితులకు సహాయం చేపట్టానున్నారు.   కానీ, ఇక నుంచే అసలు సమస్య మొదలవ్వబోతుందని, త్వరలోనే విజయవాడ డేంజర్ లో పడబోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ విజయవాడకు రాబోతున్న ఆ డేంజర్ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

విష జ్వరాల ముప్పు

విజయవాడ నగరంలో భారీ వర్షాల కారణంగా ఎక్కడపడితే అక్కడ వరద నీరు ఏరులా ప్రవాహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వాన తగ్గముఖం పట్టడంతో.. అధికారులు వాటిపై దృష్టి పెట్టి తమ పని తాము చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు ఎన్ని సహాయక చర్యలు చేపిట్టి నగరాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచిన.. అసలు సమస్య ప్రజల దగ్గర మొదలవుతుంది. ఎందుకంటే.. ఇప్పటికే పలు నగరంలోని పలు ఇళ్లలో, పరిసరాల్లో ఎక్కడిక్కడ నీరు నిల్వ ఉండిపోయింది. అయితే ఈ నీరు ఉన్నచోటనే ఈగలు, దోమలు క్రమక్రమంగా వ్యాపిస్తాయి. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతంల్లో ప్రజలు జ్వరాల బారిన పడతారు. ముఖ్యంగా ఈ దోమల వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇన్ఫెక్షన్స్ కు కూడా గురైయ్యే ఛాన్స్ ఉంటుంది.

పరిశుభ్రతను పాటించాలి

కనుకు ప్రతిఒక్కరూ ఇంటి చుట్టుపక్కల నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. ఈ ర్షం నీరు నిలిచిపోయిన చోట దోమల బెడద పెరిగి ఇలాంటి జ్వరాలు సంభవిస్తాయి. అందుకే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీంతో పాటు వీలైనంత మేరకు ఇంటి పరిసరాల్లో, ఇంటి వాకిట్లలో  బ్లీచింగ్ ను చల్లుకోవాలి. ఈ వర్షల కారణంగా.. ఇంట్లో ఉండే పాత వస్తువులు, ఇనుమ వస్తువుల్లో నీరు ఉంటే వెంటనే వాటిని నివారించాలి. ఇలా చేయకపోతే ఆ నీటిలో దోమలు గుడ్లు వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు, వృద్ధులు  ఉన్నవారు మరీంత జాగ్రత్తగా ఉండి ఈ చర్యలు పాటించడం మంచిది. గుర్తుంచుకోండి.. ఈ దోమలు, ఈగల వల్ల వ్యాపించిన జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి వైరస్ లే వ్యాప్తి చెందుతుంది. ఇకపోతే వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కలుషితమైన నీరు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కనుక  వీలైనంత వరకు అందరూ  కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిది.

జ్వరాల లక్షణాలు

ఒకవేళ ఎవరికైనా ఏమాత్రం జలుబు, జ్వరం, అలసట, విరోచనాలు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, కడుపులో తిప్పడం, వికారం వంటి లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే అవన్నీ విష జ్వరాలకు సంకేతం. కనుక వెంటనే ఈ లక్షణాలు వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించి తగిన టెస్ట్ లు చేసుకొని, చికిత్స తీసుకోవడం మంచింది.

Show comments