Arjun Suravaram
ఇటీవల నిర్వహించిన ఓ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అని, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ అని గుర్తుకు వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు
ఇటీవల నిర్వహించిన ఓ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అని, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ అని గుర్తుకు వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు
Arjun Suravaram
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉంది. ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు మీద ఉంది. గులాబీ బాస్ ప్రజా ఆశీర్వదం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన ఓ సభలో ఏపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అని, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ అని గుర్తుకు వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సజ్జల స్పందిస్తూ.. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందునే ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడుతున్నారేమో అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గొప్పగా చెప్పుకోవడానికి సీఎం కేసీఆర్ చిన్నచిన్న రోడ్ల గురించి మాట్లాడి ఉండవచ్చని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా సుపరిపాలన అందిస్తోందని తెలిపారు. అంతేకాక అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటోందని సజ్జల చెప్పారు.
ఏపీ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పథకాన్ని కేసీఆరే మెచ్చుకొన్నారని, వైఎస్ జగన్‌లాగా పెన్షన్ అందిస్తామని ఈమధ్యనే చెప్పారని గుర్తు చేశారు. పోలవరం విలీన మండలాల ప్రజలను మళ్లీ తెలంగాణలో కలుస్తారా? అని అడిగితే వెళ్లమని అంటున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చాయని ఆ మండలాల ప్రజలు చెబుతున్నారని చెప్పారు. తాము పక్క వారి గురించి ఎప్పుడూ మాట్లాడబోమని తెలిపారు. మరి.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.