iDreamPost
android-app
ios-app

తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. సులభంగా డబ్బులు సంపాదించుకునే ఛాన్స్!

Rudset Offers Free Training: తెల్ల రేషన్ కార్డు ఎన్నో పథకాలకు ప్రామాణికంగా ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. పేద ప్రజల తెల్ల రేషన్ కార్డు ఒక వరం అనే చెప్పాలి.

Rudset Offers Free Training: తెల్ల రేషన్ కార్డు ఎన్నో పథకాలకు ప్రామాణికంగా ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. పేద ప్రజల తెల్ల రేషన్ కార్డు ఒక వరం అనే చెప్పాలి.

తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. సులభంగా డబ్బులు సంపాదించుకునే ఛాన్స్!

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అన్న విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. రేషన్ పంపిణీ నుంచి ఎన్నో సంక్షేమ పథకాల్లో సబ్సిడీ కి ఈ కార్డును ప్రాతిపదికన తీసుకుంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా తెల్ల రేషన్ కార్డు దారులకు రుడ్ సెట్ అనే సంస్థ గొప్ప శుభవార్త చెప్పింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రూట్ సెట్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వీడియోగ్రఫీ, ఫోటో గ్రఫి, కారు డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్లు తెలియజేశారు. అనంత పురంలోని రూట్ సెట్ సంస్థలో మే 20 నుంచి 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్ట్ విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కారు డ్రైవింగ్, బైక్ మెకానిక్ పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ట్రైనింగ్ కోసం.. ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెదిన వారై ఉండాలని తెలిపారు.

ఇందుకోసం అభ్యర్థులు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచిత కల్పిస్తామని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. అలాగే ఒంగోలు జిల్లా వాసులకు కూడా రూడ్ సెట్ సంస్థ స్వయం ఉపాధి శిక్షణ అవకాశం కల్పిస్తుందని సంస్ డైరెక్టర్ తెలిపారు. ఒంగోలులో రూడ్ సెట్ సంస్థలో మే 22 వ తేదీ నుంచి ఫోటో గ్రఫి, వీడియో గ్రఫిలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్ట్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 19 సంవత్సాల నుంచి 45 సంవత్సరాల లోన్న వారికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు అర్హులని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి