Arjun Suravaram
Public Holidays: విద్యార్థులు ఏయే రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నాయోనన్న విషయాన్ని ముందస్తుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే సెలవు రోజుల్లో ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. ఈ క్రమంలోనే వారికి వద్దన్న సెప్టెంబర్ నెలలో సెలవులు గట్టిగానే వచ్చాయి.
Public Holidays: విద్యార్థులు ఏయే రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నాయోనన్న విషయాన్ని ముందస్తుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే సెలవు రోజుల్లో ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. ఈ క్రమంలోనే వారికి వద్దన్న సెప్టెంబర్ నెలలో సెలవులు గట్టిగానే వచ్చాయి.
Arjun Suravaram
విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవులు రావడం అనేది సర్వసాధారణం. ప్రభుత్వ సంస్థలకు అయితే హాలీడేస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ప్రతి నెలలో ఎన్నోకొన్ని సెలవులు ఉంటాయి. అందుకే కొత్త నెల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. కొత్త నెలలో ఏయో రోజుల్లో స్కూల్స్ కి హాలీడేస్ ఉన్నాయో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలా చూస్తున్న విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. మరి.. సెప్టెంబరు నెలలో పెద్దసంఖ్యలోనే సెలవులు ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
మరో నాలుగు రోజుల్లో సెప్టెబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ ఐదు రోజులు అనేవి రెండు రాష్ట్రాల్లో కలిపి ఉండనున్నాయి. సెప్టెంబర్ 7, 16వ తేదీలను ప్రభుత్వం పబ్లిక్ హాలీడే గా ప్రకటించింది. ఆ రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూసి ఉండనున్నాయి.సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగ వచ్చింది. ఈ 7వ తేదీ..శనివారం వస్తుంది. ఆ తరువాత ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవు రానున్నాయి. ఈ వినాయక చవితి పండుగ చాలా రాష్ట్రాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే.. సెప్టెంబర్ నెలలో మరో పబ్లిక్ హాలిడే ను ప్రభుత్వం ప్రకటించింది. మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెప్టెంబర్ 16వ తేదీన జరుపుకుంటారు. ఈపండగ సోమవారం వస్తుంది. అంతకంటే ముందు రోజు సెప్టెంబర్ 15 ఆదివారం.. అది ఎలాగు హాలీడేనే. అదే విధంగా సెప్టెంబర్ 14వ తేదీన రెండో శనివారం వచ్చింది. ఇలా సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వరుస మూడు రోజులు హాలీడేలు వచ్చాయి. సెప్టెంబర్ 16వ తేదీన అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూసి ఉంటాయి. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. వివిధ పండగల, ఇతర కార్యక్రమాల వల్ల ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు. విద్యార్థులకు మాత్రం ఏకంగా ఐదు రోజులు హాలీడేస్ వచ్చాయి. తాజాగా హాలీడేస్ లిస్ట్ తెలియడంతో కొందరు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఈ సెలవు రోజుల్లో ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మొత్తంగా వచ్చే నెలలో కొన్ని రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు సెలవులు రానున్నాయి.