iDreamPost
android-app
ios-app

ఆయన్ని అనడానికి నీకు సిగ్గులేదా?.. చంద్రబాబుపై పోసాని పైర్‌!

ఆయన్ని అనడానికి నీకు సిగ్గులేదా?.. చంద్రబాబుపై పోసాని పైర్‌!

ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఫైర్‌ అయ్యారు. అమరావతి భూములపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. శుక్రవారం పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గులేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు.

బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన విషయం గుర్తులేదా అని అన్నారు. చంద్రబాబుకు పేదల ఉసురు తగులుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట వింటే అమరావతి రైతులు నాశనం అవుతారని అన్నారు. రామోజీరావు, రాధాకృష్ణలాంటి వాళ్లను ఎక్కడా చూడాలేదన్నారు. పేపర్‌ను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారు రైతులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. చంద్రబాబు గురించి మాట్లాడటం వేస్ట్‌ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు లాంటి చీటర్‌ ఎక్కడా ఉండడని అన్నారు. లోకేష్‌కు మంగళగిరి అన్న పేరు చదవటం కూడా తెలీదని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన లోకేశ్‌కు మంత్రి పదవి ఇచ్చారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబును సీఎం చేయటమే పవన్‌ కల్యాణ్‌ లక్ష్యం అని అన్నారు. చిరంజీవిని ఓడించినా కూడా పవన్‌.. చంద్రబాబు వెనకాల తిరుగుతున్నాడంటూ మండిపడ్డారు. గతంలో చంద్రబాబును తిట్టి.. ఇప్పుడు ఆయన వెనకాలే పవన్‌ కల్యాణ్‌ తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి, చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet