iDreamPost
android-app
ios-app

మెట్రోలో మంచూరియా తిన్న ప్రయాణీకుడు.. షాకిచ్చిన అధికారులు!

  • Published Oct 06, 2023 | 5:36 PM Updated Updated Oct 06, 2023 | 5:36 PM
  • Published Oct 06, 2023 | 5:36 PMUpdated Oct 06, 2023 | 5:36 PM
మెట్రోలో మంచూరియా తిన్న ప్రయాణీకుడు.. షాకిచ్చిన అధికారులు!

ఇటీవల మెట్రో రైళ్లు చిత్రవిచిత్రమైన ఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. ప్రాంతం మారిన వేదికగా మాత్రం మెట్రో రైళ్లు మారుతున్నాయి. ఢిల్లీ, ముంబై మెట్రో రైళ్లలో కొందరు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ లవర్స్ మెట్రోలో కిస్ లు మునిగిపోయారు. మరో వ్యక్తి మెట్రో రైల్లో బాత్ డబ్ పెట్టుకుని స్నానం చేశాడు. కొందరు యువతులు అయితే ఫ్యాషన్ షో చేశారు. తాజాగా ఓ వ్యక్తి మెట్రో రైలులో ఓ ప్రయాణీకుడు మంచూరియా తిన్నాడు. గోబీ మంచూరియా తింటూ వీడియోకు పోజులిచ్చాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

కర్ణాటక రాజధాని బెంగుళూరు మెట్రో రైళ్లలో కఠిన నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇక నిబంధనల ప్రకారం  మెట్రో రైళ్లలో ఆహారం తినటం, ప్లాట్‌ఫారమ్‌లపై భోజనం చేయడం నిషేధం ఉంది. ఈక్రమంలోనే సునీల్ కుమార్ అనే వ్యక్తి జయనగర్- సంపిగె రోడ్డు స్టేషన్ల మధ్య మెట్రో ప్రయాణం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు మెట్రోలో తన స్నేహితులతో కలిసి ఆఫీస్ కు బయల్దేరాడు. అదే సమయంలో మెట్రోలో కూర్చుని మంచూరియా తిన్నాడు. అంతేకాక అదేదో పెద్ద ఘనకార్యం చేశానట్లు తన స్నేహితులుతో వీడియో తీయించారు. అతనికి స్నేహితులు కూడా హెచ్చరించినట్లు వీడియోలో కనిపిచింది.

‘‘అన్ ఎడ్యూకేటడ్ ఫెలో.. మెట్రోలో జర్నీ చేస్తూ తింటున్నాడు” అంటూ మాట్లాడటం స్పష్టంగా వినిపించింది. కానీ సునీల్ మాత్రం స్నేహితుల మాటలను పట్టించుకోకుండా నవ్వుకుంటూ మంచూరియాను తినటం కొనసాగించాడు. ఆ తరువాత వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయటంతో మెట్రో యాజమాన్యం షాకిచ్చింది. మెట్రో నిబంధనలు అతిక్రమించటంలో యాజమాన్యం పోలీసులకు సదరు ప్రయాణీకుడిపై ఫిర్యాదు చేసింది. రూ.500లు జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş