వీడియో: యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు తప్పిన ప్రమాదం!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేశాడు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.  ఇప్పటి వరకు 2300 కిలో మీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశాడు. అయితే బుధవారం వినుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర జరిగింది.  ఈపాదయాత్రలో లోకేశ్ కు పెను ప్రమాదం తప్పింది. రోడ్డు నుంచి పొలాల్లోకి వెళ్తుండగా కాలు జారి కింద పడబోయారు.  అప్రమమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది లోకేశ్ ను పట్టుకున్నారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 174వ రోజు వినుకొండ నియోజకవర్గంలో కొనసాగింది. వినుకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. తాను ముర్ఖుడినని, తగ్గేదే లేదంటూ, అందరి పేర్లను ఎర్ర బుక్ లో రాసుకుంటున్నాని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాని లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్ర బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం, పట్టణంలో సాగింది.  అయితే ఈ పాదయాత్రలో తరచూ లోకేశ్ కు ప్రమాదాలు తప్పుతున్నాయి. ఇటీవలే దర్శి నియోజవర్గంలో కార్యకర్తలు ఒక్కసారిగా లోకేశ్ మీద పడబోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అదుపు  చేశారు. అయితే క్షణం పాటు లోకేశ్ ఉక్కిరిబిక్కి అయ్యారు.

ఈ ఘటన మరువక ముందే.. వినుకొండ నియోజవర్గంలో లోకేశ్ కు మరో పెను ప్రమాదం తప్పింది. ఆయన పాదయాత్రలో భాగంగా రోడ్డుపై వెళ్తున్న క్రమంలో పక్కన పొలాల్లో ఉన్న కొందరు మహిళా రైతులు లోకేశ్ ను చూసేందు రోడ్డు వైపు వస్తున్నారు. ఈక్రమంలో లోకేశ్ వారి వద్దకే వెళ్లేందుకు రోడ్డుపై నుంచి పొలాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో రోడ్డుపక్కన ఉన్నమట్టిగట్టుపై కాలు వేశారు. ఈ క్రమంలో కాలు జారి  లోకేశ్ పడబోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయను పట్టుకున్నారు. దీంతో కార్యకర్తలతో సహా అందరు ఊపిరి పీల్చున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: ఆయన్ని అనడానికి నీకు సిగ్గులేదా?.. చంద్రబాబుపై పోసాని పైర్‌!

Show comments