iDreamPost
android-app
ios-app

అమ్మాయి, అబ్బాయి ఒకే రూమ్ లో ఉంటే.. ఎఫైర్ పెట్టుకున్నట్టేనా: మిస్ వైజాగ్ భర్త

  • Published Jun 01, 2024 | 1:38 PM Updated Updated Jun 01, 2024 | 1:38 PM

Miss Vizag Nakshatra Issue: ఇప్పుడు సోషల్ మీడియాలో మిస్ వైజాగ్ నక్షత్ర - సాయి తేజ కు సంబంధించిన ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తుంది.

Miss Vizag Nakshatra Issue: ఇప్పుడు సోషల్ మీడియాలో మిస్ వైజాగ్ నక్షత్ర - సాయి తేజ కు సంబంధించిన ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తుంది.

  • Published Jun 01, 2024 | 1:38 PMUpdated Jun 01, 2024 | 1:38 PM
అమ్మాయి, అబ్బాయి ఒకే రూమ్ లో ఉంటే.. ఎఫైర్ పెట్టుకున్నట్టేనా: మిస్ వైజాగ్ భర్త

తెలుగు రాష్ట్రాల్లో మిస్ వైజాగ్ నక్షత్ర ఇష్యూ పెను సంచలనాలకు దారి తీసింది. తన భర్త మరో మహిళలో ఉండటాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సమయంలో నక్షత్ర భర్త సాయితేజకు ఆమెకు మద్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి నక్షత్రను బయటకు పంపించారు.తనతో పెళ్లి అయి పిల్లలు ఉన్నా ఇలా ప్రవర్తించడంపై ఎంత వరకు న్యాయం.. తన భర్త తనకు కావాలంటూ పెద్ద ఎత్తున గొడవ చేసింది. నక్షత్ర – సాయి తేజ ఎపిసోడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. సాయి తేజ తన ఆఫీస్ లో ఏం జరిగిందో అనే విషయం పై క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో మిస్ వైజాగ్ నక్షత్రకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. తన భర్త విడాకులు ఇవ్వకుండా.. కూతురు ఉన్నప్పటికీ వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ మీడియా వేధికగా ఆరోపించింది.    రోజుకో అమ్మాయితో ఉంటున్నారని నక్షత్ర ఆరోపించింది. తన భర్త వేరే యువతితో ఉన్నాడని మీడియాతో అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి ఇష్యూకి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై స్పందించి సాయి తేజ మాట్లాడుతూ.. ‘మీడియాలో తనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.. అవన్నీ అవాస్తవం. ఆరోజు నాతోపాటు ఉన్నది నా భార్య కాదు. నా లవర్ కాదు.. అసలు ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. ఆమె నా మూవీస్ కి లిరికల్ రైటర్ గా పనిచేస్తుంది. గురువారం జర్నీ తర్వాత రాత్రి కావడంతో ఆఫీస్ ఫ్లాట్ లో రెస్ట్ తీసుకోమని నేనే చెప్పాను. ఉదయం జిమ్ చేని తనని నిద్ర లేపడానికి తన ఫ్లాట్ కి వెళ్లాను. అప్పటికే మీడియాతో నక్షత్ర అక్కడికి చేరుకొని నానా రబస చేసింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. నా ఫ్లాట్ లో మీడియాలతో వచ్చి రచ్చ చేయాల్సిన అవసరం నక్షత్రకు ఏముందని ప్రశ్నించారు’.

‘ నేను జిమ్ కి వెళ్లి ఇంటికైనా వెళ్తాను.. ఆఫీస్ కైనా వెళ్తాను. అది నా ఇష్టం.. ఆ అమ్మాయి అక్కడ ఉన్నంత మాత్రాన నాకు తనకు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లేనా? ఆ ఫ్లాట్ లో నేను ఒక్కడినే కాదు.. ఆఫీస్ బాయ్స్ ఉన్నారు. నాపై ఎన్నో ఆరోపణలు చేస్తుంది.. ఈ మనిషి అమ్మాయిల పిచ్చోడు.. నాకు అన్యాయం చేశాడు అంటూ నానా యాగీ చేస్తుంది. మీకు లోపల ఉన్న అమ్మాయి ఆ పనిమీదే వచ్చిందని ఎలా అనుకుంటారు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే.. అక్రమ సంబంధమేనా? రూమ్ అంతా తిరిగారు. అసభ్యంగా ఉండే ఏ ఒక్కటైనా కనిపించిందా? సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నా కష్టమంతా బుగ్గిపాలు చేసింది. ఆ అమ్మాయిని ఎంత బ్లేమ్ చేశారు. నా కారు తాళాలు, రూమ్ తాళాలు పట్టుకెళ్లింది.. ఎంత దారుణమైన మనస్థత్వం ఉన్నదో అర్థమవుతుంది. వీటన్నింటిపై నేను కూడా కేసులు పెట్టగలను.. కానీ నా కూతురు ఇబ్బంది పడుతుందని ఆగుతున్నా’ అని అన్నారు సాయి తేజ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş