iDreamPost
android-app
ios-app

తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్.. ఆ రైలు రద్దు!

తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్.. ఆ రైలు రద్దు!

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌. ఆదిలాబాద్‌- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే ఈ రైలు  సేవలు మరమ్మత్తుల కారణంగా కొన్ని రోజులు రద్దయ్యాయి. ఈనెల 10, 11 తేదీలలో సదరు రైలు సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ రూట్‌లో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల వల్ల సేవలు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ రెండు తారీఖుల్లో టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి డబ్బులు తిరిగిస్తామని అన్నారు.

కాగా, పేదవాళ్ల రైలుగా పిలిచుకునే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు గడిచిన రెండు వారాల్లో రద్దు చేశారు. వీటితో పాటు కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలను అధికారులు రద్దు చేశారు. వాటి సేవల రద్దును ఈ నెల 15 వరకు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో కూడా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. రద్దైన రైళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. విజయవాడ రూట్‌లో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల వల్ల కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు ఆగిపోవటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş