చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్!

ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశం వైపే చూస్తోంది. చారిత్రక ఘట్టానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అంతా చంద్రయాన్ 3 విజయంవంతం కావాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అంతా పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా చంద్రయాన్ 3 సక్సెస్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం వాళ్లు ఎలాంటి ప్రణాళికలు రచించారో వెల్లడించారు. వాళ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పక్కా అని భరోసానిస్తున్నారు.

రష్యా లూనా-25 ప్రయోగం విఫలం కావడంతో అందరి చూపు ఇప్పుడు చంద్రయాన్- 3పైనే ఉంది. ఈ మిషన్ సక్సెస్ కావాలని కోరుకోని భారతీయులు లేరు. అయితే ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యమేనంటూ ప్రకటించారు. ఇప్పటికే లూనా-25 క్రాష్ ల్యాండింగ్ తో అందరి మదిలో భయం నెలకొంది. లూనా-25 అతివేగం కారణంగా క్రాష్ ల్యాండింగ్ అయింది. రష్యా శాస్త్రవేత్తలు అనుకున్న దానికన్నా ఒకటిన్నర రెట్లు వేగంగా ల్యాండింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే ఇస్త్రో మాత్రం తాబేలు కంటే చిన్నగా ల్యాండింగ్ ప్రక్రియను ప్లాన్ చేసింది. చంద్రయాన్ 3 ప్రయోగంలో ల్యాండింగ్ ప్రక్రియ సెకనుకు 1 నుంచి 2 కిలోమీటర్ల వేగంతో మాత్రమే జరుగుతుంది.

ఒకవేళ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఏదైనా ఇబ్బందులు జరిగినా.. అవాంతరాలు ఎదురైనా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు పక్కా వ్యూహాలు రచించినట్లు వెల్లడించారు. ల్యాండిగ్ లో చివరి 15 నిమిషాల ప్రక్రియను కంప్యూటర్ గెడెన్స్ లోనే ఉంటుందని తెలిపారు. ల్యాండర్లో ఉండే అన్నీ సెన్సార్లు విఫలమైనా కూడా ల్యాండింగ్ చేసేలా ప్రొపల్షన్ సిస్టమ్ ను రూపొందించినట్లు తెలియజేశారు. 2 ఇంజిన్లు ఫెయిలైనా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా ప్లాన్ చేశామని అధికారులు వెల్లడించారు. వర్టికల్ ల్యాండింగ్ ఎంతో కీలకమని చెప్పారు. ఆగస్టు 23 సాయంత్రం 5.44 గంటలకు ల్యాండిగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

వివిధ దశలు, వివిధ వేగాలతో ఈ ప్రక్రియ సాగుతుంది. సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టనుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపైకి అడుగు పెడుతుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పూర్తి ప్రక్రియను ఇస్రో ప్రత్యక్షప్రసారం చేయనుంది. చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ నుంచి కీలక సమాచారాన్ని సేకరించనున్నారు. సౌత్ పోల్ ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఎక్స్ ప్లోర్ చేయనుంది. అసలు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? దక్షిణ ధ్రువంపై నీటిజాడ ఉందా? ఉంటే మనకు అనుకూలంగా ఉంటుందా? చంద్రుడిపై మట్టి పొరలు ఏ విధంగా ఉంటాయి? వాటి లక్షణాలు, మానవాళికి వాటి వల్లే ప్రయోజనాలు ఉన్నాయా అనే విషయాలు వెల్లడి అవుతాయి.

Show comments