Dharani
IMD-Heavy Rains, Khammam, Vijayawada: నిన్నటి వరకు భారీ వర్షాలతో అల్లాడిన విజయవాడ, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఆ వివరాలు..
IMD-Heavy Rains, Khammam, Vijayawada: నిన్నటి వరకు భారీ వర్షాలతో అల్లాడిన విజయవాడ, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఆ వివరాలు..
Dharani
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం కారణంగా గత మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరపి లేని వానల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం స్రుష్టించాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ జిల్లాలు వరదల ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. నిన్నటి నుంచి వర్షాలు తగ్గినా.. వరదల వల్ల కలిగిన నష్టం నుంచి కోలుకోవాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. ఇళ్లలోకి బురద చేరి.. సర్వనాశనం అయ్యింది. ఇదిలా ఉండగానే వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న 6 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాలకు భారీ వర్షం ముప్పుందని చెప్పుకొచ్చింది. ఆవివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల మరో ఆరు రోజులు అనగా సెప్టెంబర్ 4 అనగా నేటి నుంచి 9 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరీ ముఖ్యంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలతో అల్లాడుతున్న విజయవాడ, ఖమ్మం జిల్లాలోనే మరోసారి కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఈ వార్త విని ఆ జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయి విజయవాడ, ఖమ్మం జిల్లాలు. ఈ పరిస్థితి చక్కబడటానికే చాలా సమయం పట్టేలాగా ఉందని అధికారులు అంచనా వేస్తుండగా.. మరోసారి భారీ వర్షాలు, వరదలు ఏర్పడే పరిస్థితి వస్తే.. కోలుకోవడం ఇక ఇప్పట్లో సాధ్యం కాదని అంటున్నారు. మరి ఈ ముప్పు నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి. కానీ మరో వారం పాటు వర్షాలంటే.. రెండు రాష్ట్రాల జనాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.