ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

IMD Alert for AP and Telangana: గత రెండు నెలల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఒకటీ రెండు రోజులు మినహాయిస్తూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది.

IMD Alert for AP and Telangana: గత రెండు నెలల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఒకటీ రెండు రోజులు మినహాయిస్తూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది.

ఈ ఏడాది ఎండలు ఎలా దంచికొట్టాయో.. అంతకు రెట్టింపు వర్షాలు పడుతున్నాయి.దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి.. దీని ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా డ్యాములు, కాల్వలు, చెరువులు నిండుకుండలా మారిపోయాయి. పలు ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గుజరాత్ లో భారీ వర్షాలకు ప్రజలు అల్లలాడిపోతున్నారు.. అక్కడ పరిస్థితులు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భంధంలో మునిగిపోయాయి.  తాజాగా ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కోమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, జనగాం జిల్లాలకు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉదని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవొద్దని హెచ్చరించారు. హైదరాబాద్ లో వాతావరణం విచిత్రంగా ఉంది.. ఉదయం ఎండలు దంచి కొడుతూ.. సాయంత్రం వేళ్ల వర్షాలు పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అల్ప పీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు చేరుకునే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.దీని ప్రభావంతో నార్త్ కోస్టల్ లో పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాతో పాటు యానాం నేడు ఉరుములతో కూడి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. శుక్ర,శని వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను బట్టి వేటకు వెళ్లవొద్దని సూచిస్తున్నారు.

Show comments