AP: తీరం దాటిన వాయుగుండం! ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన కారణంగా వానలు కుండపోతగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన కారణంగా వానలు కుండపోతగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పననవసరం లేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఈ కుండపోత వర్షాలకు అతలాకుతలం అయిపోయాయి. పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ వరదలకు విజయవాడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో దారుణమైన వరదలు వచ్చాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన కారణంగా వర్షం ముప్పు తప్పదు. వానలు కుండపోతగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వాతావరణ శాఖ అంచనా వేసిన దాని ప్రకారం ఓడిశాలోని పూరి దగ్గర ఉదయం 11.30 గంటలకు తీరం దాటింది. దీని ప్రభావం రాష్ట్ర ప్రజలకు మరో 24 గంటల పాటు తప్పదని అధికారులు వెల్లడించారు. ఈ వాయు గుండం ఇంకా తీవ్రంగా కొనసాగనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ వాయుగుండం సోమవారం అర్ధ రాత్రి వరకు కొనసాగుతూ బలహీన పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇంకా తూర్పు గోదావరీ, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. అలాగే, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉంటుందని అన్నారు. అందువల్ల కచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గంటకు ఏకంగా 30 – 40 కిలోమీటర్ల వేగంతో భారీగా గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, వాయుగుండం వలన దక్షిణ ఒడిశా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాబట్టి రానున్న 24 గంటల్లో వర్షాల బీభత్సం తప్పదు. కాబట్టి ప్రజలు బయటకు రాకుండా ఉండటం మంచిది. మరి వాయుగుండం తీరం దాటడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

 

Show comments