P Venkatesh
సాధారణంగా ఉద్యోగ జీవితంలో అందుబాటులో ఉన్న సెలవులతో పాటు అదనంగా కూడా సెలవులు తీసుకుంటుంటారు. అసలు సెలవు తీసుకోకుండా ఉండడం అసాధ్యమనే చెప్పాలి. అలాంటి తరుణంలో కడారి సుబ్బారావు తన ఉద్యోగ జీవితంలో ఏ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా అరుదైన ఘనతను సాధించాడు.
సాధారణంగా ఉద్యోగ జీవితంలో అందుబాటులో ఉన్న సెలవులతో పాటు అదనంగా కూడా సెలవులు తీసుకుంటుంటారు. అసలు సెలవు తీసుకోకుండా ఉండడం అసాధ్యమనే చెప్పాలి. అలాంటి తరుణంలో కడారి సుబ్బారావు తన ఉద్యోగ జీవితంలో ఏ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా అరుదైన ఘనతను సాధించాడు.
P Venkatesh
చేసే పని మీద ఇష్టం, అంకితభావం ఉండాలే గాని విజయం తథ్యం. దాంతో పాటు కీర్తి ప్రతిష్టతలు కూడా వరిస్తాయి. మనం చేసే వృత్తి పట్ల చూపించే శ్రద్ద మన విలువను అమాంతం పెంచుతుంది. ఇదే మాదిరిగి ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సుదీర్ఘమైన సర్వీసులో ఏ ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. దీనిని బట్టి తెలుసుకోవచ్చు ఆ ఉద్యోగి డెడికేషన్ ఎలాంటిదో. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే సాధారణ లీవ్స్, ఆప్షనల్ లీవ్స్ అంటూ చాలానే సెలవులు ఉంటాయి. వ్యక్తిగత పనులు ఉన్నప్పుడు లేదా ఇతర అత్యవసర సందర్భాల్లో ఆ సెలవులను వాడుకుంటుంటారు. కానీ ఆ ఉద్యోగి మాత్రం వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా విధులకు హాజరవ్వడం మాత్రం మరువలేదు. ఆ ప్రభుత్వ ఉద్యోగియే కడారి సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి.
సాధారణంగా ఉద్యోగ జీవితంలో అందుబాటులో ఉన్న సెలవులతో పాటు అదనంగా కూడా సెలవులు తీసుకుంటుంటారు. అసలు సెలవు తీసుకోకుండా ఉండడం అసాధ్యమనే చెప్పాలి. అలాంటి తరుణంలో కడారి సుబ్బారావు తన ఉద్యోగ జీవితంలో ఏ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా అరుదైన ఘనతను సాధించాడు. కడారి సుబ్బారావు తన 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదంటే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారం వృత్తి పట్ల అతనికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఇలాంటి ఉద్యోగులు ఉంటే ఏ రంగంలోనైనా మంచి ఫలితాలను సాధించొచ్చు అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కడారి సుబ్బారావు కాకినాడ జిల్లా విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గొల్లప్రోలుకు చెందిన కడారి సుబ్బారావు 1987లో గ్రూప్–4 ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30న కడారి సుబ్బారావు పదవీ విరమణ పొందనున్నారు. అయితే తన ఉద్యోగ జీవితం 36 ఏళ్ల 8 నెలల సర్వీసులో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదు. కడారి సుబ్బారావు 2003 నుంచి ఇప్పటి వరకూ 6 సార్లు ఉత్తమ జిల్లా స్థాయి ఉద్యోగిగా ఎంపికయ్యారు. 2009లో తెలుగు అకాడమీ పురస్కారం అందుకున్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సెలవు పెట్టని కడారి సుబ్బారావుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.