ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

Hyderabad Vijayawada Transportation: ప్రయాణికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై దాదాపు 30 గంటల తర్వాత వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.

Hyderabad Vijayawada Transportation: ప్రయాణికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై దాదాపు 30 గంటల తర్వాత వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల ధాటికి రోడ్లు ధ్వంసం అయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైలు, రోడ్డు మార్గాలు వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వందల సంఖ్యలో బస్సులు, రైళ్లు రద్దయ్యాయి. ఇక నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మార్గంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.

వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ మార్గంలో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా నందిగామ మండలంలో మున్నేరు వాగుకు వరద తగ్గడంతో అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై దాదాపు 30 గంటల తర్వాత వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా గరికపాడు వద్ద కొత్త వంతెనపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా మళ్లించారు. రాకపోకలు మళ్లీ షురూ కావడంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించినట్లైంది. ఇదిలా ఉంటే ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

Show comments