టీటీడీ గుడ్‌ న్యూస్‌.. వారికి నెలకోసారి శ్రీవారి దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాల్లో ఎంతో మంది విద్యార్థులు తమ చదువును కొనసాగిస్తున్నా విషయం తెలిసిందే. అయితే చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు టీటీడీ సంస్థ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ ని తెలిపింది. అదేమిటంటే..

తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాల్లో ఎంతో మంది విద్యార్థులు తమ చదువును కొనసాగిస్తున్నా విషయం తెలిసిందే. అయితే చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు టీటీడీ సంస్థ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ ని తెలిపింది. అదేమిటంటే..

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. దేశం నలువైపుల నుంచి కోట్లాది మంది భక్తులు ఆ శ్రీవారిని దర్శంచుకోనటకు తిరుమల కొండకు వెళ్తుంటారు. అయితే ఇక్కడ టీటీడీ సంస్థ అనేక ఉచిత సేవ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు.. ఎంతోమంది విద్యర్థులకు దేవస్థానం తరుపున చదువును అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది విద్యర్థులు టీటీడీ నిర్వహిస్తున్న కళాశాలల్లో చదువులను కొనసాగిస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తిరుమలలో.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందించి అఛీవర్ అవార్డులు కూడా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ సంస్థ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ ని తెలిపింది. అదేమిటంటే..

తాజాగా తిరుపతి మహతి ఆడిటోరియంలో విద్యార్థుల‌ సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగానే టీటీడీ విద్యాసంస్థకు చెందిన.. అకడమిక్స్, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో కరికులర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 240 మంది విద్యార్థిని విద్యార్థులకు.. 5 గ్రాముల వెండి డాల‌ర్‌, ప్రశంసాపత్రంను అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని టీటీడీ సంస్థ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఈవో సదా భార్గవి.. ఈ టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినిలు చదువుల్లో రాణించాలని కోరారు.

ఈ సందర్భంగా.. విద్యార్థినులకు నెలకోసారి తిరుమల స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే, తిరుమల శ్రీవారి భక్తుల కానుకల ద్వారా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో, ఏకాగ్రతతో విద్యాను నేర్చుకోవాలన్నారు. ఇక కళాశాలలో నిర్వహించే మెంటార్ షిప్, ప్రేరణ లాంటి కార్యక్రమాలను సద్వినియోగించుకోవాలని సూచించారు. కాగా, విద్యార్థినులు చదువుతోపాటు తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయాలన్నారు.

అలాగే విద్యార్థినుల తల్లిదండ్రుల సౌకర్యార్థం నిర్మించిన ధాత్రి సదన్‌ను జేఈవో ప్రారంభించారు. దీంతో పాటు.. నీట్, ఎంసెట్, లాసెట్, సీఏ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్ వసతి కల్పిస్తామన్నారు. కాగా, గత సంవత్సరం వచ్చిన ఫలితాలను అభినందించారు. ఈ ఫలితాల సాధనకు కారకులైన డీఈవోకు, ప్రిన్సిపాల్ కు అధ్యాపకులకు, విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు. ఈ మరి, విద్యార్థులకోసం టీటీడీ సంస్థ ప్రకటించిన గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments