APలో ఆ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ నిబంధన రద్దు!

APలో ఆ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ నిబంధన రద్దు!

ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగులకు సంబంధించిన విషయంలో తరచూ వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల పెంపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాలకు  కింద టైపిస్ట్, యూడీ టైపిస్ట్, టైపిస్ట్‌ కమ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను పొందిన వారు కేవలం కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే చాలంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కారుణ్య నియమాకం ద్వారా ఉద్యోగంలో చేరిన వారిని రెగ్యులరైజ్ చేసే విషయంలో పాత నిబంధనలకు ఏపీ ప్రభుత్వం స్వస్థి పలికింది. కారుణ నియమాకం కింద  టైపిస్ట్, ఎల్ డీ టైపిస్ట్, యూడీ వంటి  ఉద్యోగాలు పొందిన వారు కంప్యూటర్ పరీక్ష పాసయ్యితే.. వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయనుంది. ఈ కొత్త నిబంధన అనుగుణంగా  ఇక నుంచి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే  అవసరం లేదు.

ఈ నిబంధనకు స్వస్తి పలుకుతూ  సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యోగులు రెండేళ్లలోపు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు పోలా భాస్కర్ తెలిపారు. తాజా ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయంపై  సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా ఇబ్బందిపడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.

టైపింగ్‌కి ప్రాధాన్యత లేకపోవడంతో అది నేర్పే వాళ్లు లేక ఆ పరీక్ష పాస్ కాలేక.. ఇలా చాలా మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి రెగ్యులర్ కాక పీఆర్సీ అమలు కాక చాలా తక్కువ జీతంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి గమనించి కారుణ్య నియామకం ద్వారా ఎంపికన ఉద్యోగులకు టైప్ రైటింగ్ పరీక్షను మినహాయించాలని సీఎంను కోరామన్నారు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరి.. కారుణ్య నియామకం ఉద్యోగాల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 11 ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం జగన్!

Show comments