iDreamPost
android-app
ios-app

Veligonda Project: నాడు తండ్రి ప్రారంభిస్తే.. నేడు కొడుకు పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కథ!

  • Published Mar 06, 2024 | 9:49 AM Updated Updated Mar 06, 2024 | 8:04 PM

వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల కల...ప్రకాశం, వైఎస్సార్‌, నెల్లూరు జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల సుదీర్ఘ స్వప్నం నేడు సాకారం కానుంది. నాడు తండ్రి వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే నేడు ఆయన తనయుడు జగన్ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయనున్నారు. మరి.. ఈ వెలుగొండ పూర్తి కథ ఏమిటో ఇప్పుడు తెలుకుందాం..

వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల కల...ప్రకాశం, వైఎస్సార్‌, నెల్లూరు జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల సుదీర్ఘ స్వప్నం నేడు సాకారం కానుంది. నాడు తండ్రి వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే నేడు ఆయన తనయుడు జగన్ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయనున్నారు. మరి.. ఈ వెలుగొండ పూర్తి కథ ఏమిటో ఇప్పుడు తెలుకుందాం..

  • Published Mar 06, 2024 | 9:49 AMUpdated Mar 06, 2024 | 8:04 PM
Veligonda Project: నాడు తండ్రి ప్రారంభిస్తే.. నేడు కొడుకు పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కథ!

వెలిగొండ ప్రాజెక్ట్.. ఇది కేవలం కొందరికి ఓ నీటి ప్రాజెక్టు మాత్రమే. కానీ ప్రకాశం జిల్లా వాసులకు, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు మాత్రం ప్రాణంతో సమానం. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ బతుకులు బాగుపడతాయని కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రాంత ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. నాడు తండ్రి వైఎస్సార్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే..నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనులు పూర్తి చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. ప్రజలకు, రైతులకు పుష్కలంగా నీరందించనున్నారు. మరి.. ఈ మూడు జిల్లాల ప్రజలకు ఊపిరిగా నిలిచిన ఈ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి వివరాలు, ఈ తండ్రి కొడుకులు చేసిన కృషి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాయలసీమతో పాటు ఎక్కువగా కరువు తాండవించే ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లా. ఈ దుర్భిక్ష ప్రాంతాల ప్రజలు.. తమ నీటి సమస్య ఎలా తీరుతుందా అని కొన్ని దశాబ్దాల పాటు ఎదురు చూశారు. ఈ క్రమంలో  మార్కాపురం డివిజన్ పెద్ద దోర్నాల సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పడినది వెలిగొండ ప్రాజెక్ట్. దీని పూర్తి పేరు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. శ్రీశైలంలోని అదనపు నీటిని రెండు సొరంగ మార్గాల ద్వారా ఈ ప్రాజెక్టుకి తరలిస్తారు. ఈ క్రమంలోనే నాడు వైఎస్సార్.. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి సారించారు.

వెలిగొండ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసి ఈ మూడు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారం చేద్దామని మహానేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వజ్ర సంకల్పంగా 2004లో వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కుల నీటిని తరలించడం ద్వారా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌ ప్రాజెక్టును నిర్మించేలా  ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు,  పలు మండలాల్లోని 16 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించే విధంగా ఈ వెలిగొండ ప్రాజెక్టు డిజైన్‌ ను తయారు చేశారు. ఈ ప్రాజెక్టుకు డీపీబీఆర్ ను 1994లో రూపొందించారు.

1996లో సీఎంగా చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. దీంతో 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ ఈ జలయజ్ఞానికి తిరిగి శ్రీకారం చుట్టారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2004 అక్టోబర్‌ 27న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారు. జలయజ్ఞంలో భాగంగా 5300 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించారు. రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి ఐదేళ్ల కాలంలో 50 శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. అయితే ఆయన అకాల మరణంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు మరుగున పడిపోయాయి. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు దీనిపై అంతగా శ్రద్ధ చూపించలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా వెలిగొండ ప్రాజెక్ట్ ను ఏటీఎంగా వాడుకుని నిధులు మింగేశారే తప్ప.. పనులు ముందుకు సాగలేదు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంత వాసులకు హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీ ముందుకు వస్తానంటూ హామీ ఇచ్చారు. అదే విధంగా 2019లో ఘన విజయం సాధించి.. అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ముందడుగు వేశారు. రివర్స్‌ టెండర్ల ద్వారా రూ.61.76 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే రెండు సొరంగ  పనులను పూర్తి చేసి ప్రకాశం పశ్చిమ ప్రాంతంతో పాటు కడప, నెల్లూరు జిల్లాల ప్రజల్లో ఆనందం నింపారు.

ఈ మూడు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముందుకు సాగారు. 57 నెలల పాలనలో కరోనా రెండేళ్లు విజృంభించినా, ఆ మహమ్మారి కారణంగా పనులు చేయలేక పోయారు. అయినా ఆ తర్వాత పనులు వేగవంతం చేశారు. మిగిలిన పొయిన మొదటి సొరంగం పనులను 2019 నవంబర్‌ లో ప్రారంభించారు. మొత్తం సొరంగం 18.8 కిలోమీటర్లు. అప్పటికే తవ్వగా మిగిలిపోయిన 2.883 కిలో మీటర్లు 2021 జనవరి 18 నాటికి పూర్తి చేయించారు.

శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్‌ కు నీటిని తరలించి హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను కూడా అదే  ఏడాదిలో పూర్తి చేయించారు. ఇక ఇటీవలే రెండో టన్నెల్ పనులు కూడా పూర్తి చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల్లో వెలిగొండ ప్రాజెక్టుపై ఉన్న ఆశలను చిగురింపజేశారు. మొత్తంగా ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు  ఎదురు చూస్తున్న కలను నేడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాకారం చేయనున్నారు. ఆ విధంగా వెలిగొండ ప్రాజెక్ట్ ను నాడు తండ్రి ప్రారంభిస్తే.. నేడు కొడుకు పూర్తి చేశారు. వెలిగొండ పూర్తి చేసి.. ఇక్కడ ప్రజల జీవితాల్లో మార్పుకు స్వీకారం చుట్టిన వారిగా ఈ తండ్రీకొడుకులు చరిత్రలో నిలిచిపోతారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş