చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. 2 కోట్లతో పరార్! లబోదిబో అంటున్న బాధితులు!

Fraud of Two Crores in Vizianagaram: డబ్బుకు లోకం దాసోహం.. ఆ డబ్బు కోసం ఈ మధ్య చాలా మంది ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. తమ అవసరాల కోసం ఎలాంటి పనులకైనా సిద్దపడుతున్నారు.

Fraud of Two Crores in Vizianagaram: డబ్బుకు లోకం దాసోహం.. ఆ డబ్బు కోసం ఈ మధ్య చాలా మంది ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. తమ అవసరాల కోసం ఎలాంటి పనులకైనా సిద్దపడుతున్నారు.

ఇటీవల కొంతమంది కేటుగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో అక్రమాలు, మోసాలకు పాల్పపడుతున్నారు. అమాయకులను చేసి మాయమాలతో బురిడీ కొట్టించి అందినంత దోచుకుంటున్నారు. తమ వద్ద పెట్టుబడి పెడితో ఆ పెట్టుబడికి రెండు మూడింతలు తక్కువ సమయంలోనే రెట్టింపు చేసి ఇస్తామని.. చీట్టీల పేరుతో ఘరానా మోసాలకు తెగబడుతున్నారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిని టార్గెట్ చేసుకొని ఇలాంటి మోసాలకు తెగబడుతున్నారు కేటుగాళ్లు. తాము మోసపోయిన విషయం గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. అలాంటి ఘటన విజయనగరంలో జరిగింది. చిట్టీల పేరుతో ఎంతోమందిని మోసం చేసి ఉడాయించాడు ఓ ఘరానా మోసగాడు. వివరాల్లోకి వెళితే.

విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన కత్తెర వెంకటరావు అనే వ్యక్తి సుమారు వంద మంది నుండి రెండున్నర కోట్ల రూపాయలు చిట్టీల వసూళ్లు చేసి రాత్రికి రాత్రే ఉడాయించాడు. వెంకటరావు వాయిదాల పద్దతిలో సామాన్లు విక్రయించేవాడు. అలా తన వద్ద సామాన్లు కొంటున్నవారిని బాగా పరిచయం చేసుకొని తన వద్ద చిట్టీ వేస్తే ఏ సమయంలో అయినా ఆదుకుంటానని నమ్మించాడు. మీ డబ్బుకు భద్రత ఉంటుందని భరోసా ఇచ్చాడు. కూలీలు, చిరు వ్యాపారులనే టార్గెట్ చేసుకొని తన వద్ద చిట్టీలు వేయించేవాడు. మొదట తన వద్ద చిట్టీలు వేసిన వారికి టైమ్ ప్రకారం ఇస్తూ ఉండేవాడు. అంతేకాదు ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే వెంటనే ఇచ్చి చిట్టీలో మినహాయించుకునే వాడు. దీంతో వెంకటరావు అంటే ఎంతో నిజాయితీపరుడు అన్న నమ్మకాన్ని పొందాడు.

చిట్టీలు కట్టే కస్టమర్స్ కు సైతం మంచి లాభాలే వచ్చాయి. అతని పై నమ్మకంతో చాలా మంది కస్టమర్లు చేరారు. తమ వద్ద పొదుపు చేసుకుంటున్న డబ్బుతో చిట్టీలు వేయడం మొదలు పెట్టారు. వాస్తవానికి 15 మంది ఉండాల్సిన చిట్టీలో ఒకరికి తెలియకుండా ఒకరిగా దాదాపు 50 మంది వరకు చిట్టీలో జాయిన్ చేయించుకున్నాడు. చిట్టీ పాట కూడా ఫోన్ కాన్ఫరెన్స్ లోనే పెట్టేవాడు. ఒకరి మొహం ఒకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. అలా తన సొంత మనుషులతో అధిక లాభాలు వచ్చేలా పాడించి ఏ ఒక్కరికీ చిట్టీ దక్కుండా ప్లాను చేస్తూ వచ్చేవాడు. ప్రతి నెల చిట్టీ తనే పాడుకునేవాడు.ప్రతినెల అలాగే చేస్తూ అందరినీ బురిడీ కొట్టించడం మొదలు పెట్టాడు.

కొంతమంది అవసరాని పాడుకున్నా డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేయడం మొదలు పెట్టాడు. దీంతో వెంకటరావుపై కస్టమర్లు ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. చిట్టీ డబ్బులు వెంటనే చెల్లించాని డిమాండ్ చేశారు. దీంతో తన భాగోతం బయటపడుతుందని గమనించిన వెంకట్రావు ఈ నెల 18న ఇంట్లో సామాను తీసుకొని భార్యాపిల్లలతో ఉడాయించాడు. మరుసటి రోజు నుంచి ఇంటికి తాళం వేయడం గమనించి కస్టమర్లు తాము మోసపోయామని గ్రహించారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని విచారణ

Show comments