విజయవాడ వరదల్లో చిక్కుకున్న కుటుంబం.. రక్షించండి అంటూ

Family Stucks In Vijayawada Floods: భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా మోకాళ్ళ లోతు పైగా నీళ్ళే ఉంటున్నాయి. గత మూడు రోజుల నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా మంది ఇళ్ళు నీట మునగడంతో తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ ఇంకా పలువురు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు.

Family Stucks In Vijayawada Floods: భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా మోకాళ్ళ లోతు పైగా నీళ్ళే ఉంటున్నాయి. గత మూడు రోజుల నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా మంది ఇళ్ళు నీట మునగడంతో తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ ఇంకా పలువురు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు.

గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ అయితే భయంకరమైన వరద ఉదృతిని చూసింది. 1903లో వరదలు వచ్చాయి. అప్పుడు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మళ్ళీ 121 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో విజయవాడ ఎప్పుడూ లేని విధంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి పలువురు మృతి చెందారు. ఇళ్ళు నీట మునగడంతో నిరాశ్రయులయిన వారిని అధికారులు పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది సహాయక చర్యలు అందక అల్లాడుతున్నారు.

విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ కుటుంబం వరదల్లో చిక్కుకుంది.  ఈ క్రమంలో తమని కాపాడండి అంటూ చైతన్య అనే వ్యక్తి అధికారులను కోరారు. వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కొత్తగా నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ కి మధ్యలో తమ ఇల్లు ఉందని.. రైతు బజార్ ఆపోజిట్ లేన్ లో మూడవ బిల్డింగ్ లో ఉంటున్నామని అన్నారు. అమూల్ ఐస్ క్రీమ్ అనే ఒక పెద్ద బోర్డు ఉంటుందని.. ఆ బిల్డింగ్ లో హార్ట్ పేషెంట్, పది రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, ఇద్దరు పసి పిల్లలు, తొమ్మిది మంది ఆడవాళ్లు, నడవలేని వాళ్ళు అందరం ఇరుక్కుపోయామని అన్నారు. దయచేసి అధికారులు తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుకుంటున్నా అని తెలిపారు. గత మూడు రోజుల నుంచి తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేవని.. పిల్లలకు పాలు కలపడానికి కూడా నీళ్లు లేవని అన్నారు.

ఎంతోమంది అధికారులకు వాట్సాప్ లో మెసేజ్ చేశానని, కాల్ కూడా చేశానని అన్నారు. తన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయే పరిస్థితికి వచ్చిందని.. దయచేసి వీలైనంత త్వరగా అధికారులు తమకు సాయం చేయండి, సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లండి అంటూ వేడుకున్నారు. ఈ వీడియోని బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ టేస్టీ తేజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. విజయవాడలో ఉన్న వారు ఎవరైనా గానీ ఈ కుటుంబానికి సాయం చేయండి అంటూ కోరారు. తాను ఈ ప్రదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని.. ఈలోపు ఎవరైనా గానీ స్థానికులు వారికి సహాయం చేయండి అంటూ టేస్టీ తేజ కోరారు. విజయవాడలో ఉన్నవారు వీరికి సహాయం చేయాలనుకుంటే కనుక ఈ కింది అడ్రస్ ని సంప్రదించగలరు. ఈ సమస్యను వీలైనంత త్వరగా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. 

చిరునామా:

  • బీవీఎస్కే చైతన్య (వంశీ) 
  • కేరాఫ్ శ్రీ నాగ లక్ష్మి నిలయం,
  • అమూల్ ఐస్ క్రీమ్ బిల్డింగ్,
  • ఆర్.ఎస్. 259/, ప్లాట్ నంబర్ 7,
  • పాముల కాలువ
  • రైతు బజార్ లేన్ ఆపోజిట్ లో, క్యాపిటల్ వే అపార్ట్మెంట్ దగ్గర 
  • జక్కంపూడి రోడ్, విజయవాడ 520001
  • +91 91601 34339, +91 89772 73699 
Show comments