జోరుగా కురుస్తున్న వర్షాలు.. రేపు ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Heavy Rains, IMD, AP Schools, Andhra Pradesh: ఎడతెరపి లేని వానలు కురుస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

Heavy Rains, IMD, AP Schools, Andhra Pradesh: ఎడతెరపి లేని వానలు కురుస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. దీనికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమే కారణం. దీని ప్రభావంతో విజయనగరం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం అంచనా వేసింది. వరదలకు విజయవాడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. బెజవాడ అనే కాదు.. భారీ వర్షాలు, వరదల వల్ల ఏపీలోని చాలా జిల్లాల్లో ప్రజా జీవనం స్తంభించిపోయింది. పలు ఊళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. దంచికొడుతున్న వానల వల్ల బడులు సరిగ్గా సాగడం లేదు. వరుణుడి బీభత్సానికి వరుసగా సెలవులు ఇవ్వక తప్పడం లేదు. రేపు కూడా రెండు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఏంటా జిల్లాలు అనేది ఇప్పుడు చూద్దాం..

అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని స్కూళ్లకు మంగళవారం సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లాలోని స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారు. జిల్లాలోని కలిదిండి, ముదినేపల్లి, భీమడోలు, మండవల్లితో పాటు కైకలూరు, ఏలూరు మండలాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా చోట్ల స్కూళ్లు మాత్రం యథాతథంగా నడుస్తాయని స్పష్టం చేశారు. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఉత్తర, వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల స్పీడ్​తో ఇది కదులుతోందని తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రేపు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేశారు అధికారులు. ఉభయ గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే డేంజర్ ఉందని.. ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బయటకు రాకుండా ఉండటం మంచిదని సూచించారు. వర్షాలతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో భారీగా గాలులు వీచే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్పక బయటకు రావొద్దన్నారు. ఏవైనా పనులు ఉంటే వాయిదా వేసుకోవడం బెటర్ అని సూచించారు అధికారులు.

Show comments